న్యూఢిల్లీ: భారత్‌లో రామాయణ, మహాభారత ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన సీరియళ్లు, సినిమాలు, నాటకాల ఆదరణకు కొదవే ఉండదు. ఇక లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమతమైన అభిమానులు, సెలబ్రిటీల కోరికమేరకు 37 ఏళ్ల క్రితం విజయవంతంగా ప్రదర్శితమైన రామాయణ్, మహాభారత్ సీరియళ్లను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రేటింగ్స్ పరంగా నయా రికార్డులను సాధిస్తున్న రామాయణ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నాడు రామాయణ్ సీరియల్‌లో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది.. తాజాగా సీతాపహరణం దృశ్యాన్ని చూస్తున్న వీడియో వైరల్ అయింది.
(చదవండి: డీడీ నంబర్ వన్)
81 ఏళ్ల వయసున్న త్రివేది సీతను అపహరించే ఘట్టం క్లైమాక్స్‌కు చేరుకున్న దృశ్యాల్ని టీవీ ముందు కూర్చుని ఆసక్తికరంగా వీక్షిస్తున్న వీడియో అది. సీతను రావణుడు చెరబడుతున్న సందర్భంలో ఆయన రెండు చేతులూ జోడించడం గమనార్హం. ఈ వీడియోను రామాయణ్ ఫ్యాన్స్ క్లబ్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది. కాగా, రామానంద్‌సాగర్ దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో 1987లో వచ్చిన ఈ సీరియల్‌లో రాముడిగా అరుణ్ గోవలి, సీతగా దీపికా చిఖిలా, లక్ష్మణుడిగా సునీల్ లహరి నటించారు.
(చదవండి: ఒక్కరోజులోనే ఆ సీరియల్‌కు 50 మిలియన్ వ్యూస్)
Comments
Please login to add a commentAdd a comment