
ఫ్రీగా దూరదర్శన్ చూడొచ్చు
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఫోన్లలో ఉచిత టీవీ సేవలను దూరదర్శన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు ఫిబ్రవరి 25 నుంచే దేశంలోని 16 నగరాల్లో అమల్లో ఉన్నట్లు దూరదర్శన్ తెలిపింది. ఒకసారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం దూరదర్శన్ చానెల్‌ను చూడడానికి ఇంటర్‌నెట్ సదుపాయం కూడా అక్కర్లేదు.