బాబు వల్లే పుష్కర మరణాలు | rajamundry tragedy due to chandrababu: vh | Sakshi
Sakshi News home page

బాబు వల్లే పుష్కర మరణాలు

Published Thu, Jul 16 2015 2:46 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

బాబు వల్లే పుష్కర మరణాలు - Sakshi

బాబు వల్లే పుష్కర మరణాలు

హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. మున్సిపల్ సమ్మెతో నగరం దుర్గంధమవుతున్నా ఎంఐఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పుష్కర ఏర్పాట్లలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రు విఫలమయ్యారని విమర్శించారు.

రాజమండ్రి పుష్కర మరణాలకు చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టినంత మాత్రానా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement