'జూ.ఎన్టీఆర్ ప్రచారం చేయనని చెప్పటంతోనే..' | V Hanumantharao fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'జూ.ఎన్టీఆర్ ప్రచారం చేయనని చెప్పటంతోనే..'

Published Tue, Mar 18 2014 2:39 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

'జూ.ఎన్టీఆర్ ప్రచారం చేయనని చెప్పటంతోనే..' - Sakshi

'జూ.ఎన్టీఆర్ ప్రచారం చేయనని చెప్పటంతోనే..'

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ వెనక చంద్రబాబు ఉన్నాడని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయనని చెప్పటంతోనే...పవన్ కల్యాణ్ను బాబు తెరమీదకు తెచ్చాడని వీహెచ్ అన్నారు.

 

గబ్బర్ సింగ్ పాపులారిటీని చంద్రబాబు వాడుకోవాలని చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం చంద్రబాబు డ్రామాలడాతున్నాడని వీహెచ్ విమర్శించారు. బీసీ నేతలకు న్యాయం చేస్తే ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలు ఇతర పార్టీలలోకి ఎందుకు వెళతారని ప్రశ్నించారు. పవన్ సినిమా డైలాంగులతో కాంగ్రెస్ భూస్థాపితం అవదని వీహెచ్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్లోనే బీసీలకు సముచిత స్థానం లభిస్తుందని వీహెచ్ అన్నారు. తెలంగాణలో బీసీలను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement