హైదరాబాద్ చుట్టుపక్కల భూములు చూపిస్తాం: వీహెచ్ | Congress Senior leader VH conducts Pressmeet | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చుట్టుపక్కల భూములు చూపిస్తాం: వీహెచ్

Published Wed, May 20 2015 3:29 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

హైదరాబాద్ చుట్టుపక్కల భూములు చూపిస్తాం: వీహెచ్ - Sakshi

హైదరాబాద్ చుట్టుపక్కల భూములు చూపిస్తాం: వీహెచ్

కరీంనగర్: పేదల ఇళ్ల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. భవిష్యత్ విద్యావసరాల కోసం అవి అవసరమన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది ఎకరాల భూములు ఉన్నాయని... వాటిని తీసుకోవాలని తెలంగాణ సర్కారుకు సూచించారు. కావాలంటే ఆ భూములను తాము చూపిస్తామన్నారు. వీహెచ్ బుధవారం కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి తెలంగాణ అభివృద్ధికి పాటు పడాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. తెలంగాణ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందన్నారు. ఇటీవల తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించదన్నారు. ఇదే విధంగా ప్రజల మద్దతుతో సర్కారు వ్యతిరేక విధానాలను ఎండగడతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement