సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ ఇందుకు మరోసారి వేదిక అయ్యింది. సీనియర్ నేత వీ హన్మంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
దీంతో గాంధీ భవన్ నుంచి వీహెచ్ బయటకు వచ్చేశారు. క్రికెట్ టోర్నమెంట్‌కు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను ఆహ్వానించేందుకు వీహెచ్ గాంధీభవన్‌కు వెళ్లారు. అయితే.. ఆ సమయంలో మహేష్ గౌడ్, వీహెచ్ మధ్య వాగ్వాదం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్‌కు ఠాక్రేను వీహెచ్ ఆహ్వానించగా.. 22వ తేదీన ఇన్‌ఛార్జి షెడ్యూల్ ఖాళీగా లేదని మహేష్ గౌడ్ బదులిచ్చారు. దీంతో ఇన్‌ఛార్జి వస్తానంటే నువ్వెందుకు అభ్యంతరం చెప్తున్నావంటూ వీహెచ్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
ఆపై బయటకు వచ్చేసిన వీహెచ్.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ‘‘ఈ కార్యక్రమం పీసీసీ ప్రెసిడెంట్ పెట్టలేదని, తాను పెట్టానని మహేష్ గౌడ్ తనతో అన్నాడని, పీసీసీ ప్రెసిడెంట్‌కే లేని అభ్యంతరం అతనికి ఎందుకని? ఎవరికి వారే ఇక్కడ లీడర్ ఉన్నారంటూ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారాయన.
Comments
Please login to add a commentAdd a comment