బీజేపీ నేతపై చేయి చేసుకున్న వీహెచ్
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావుపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అంబర్ పేటలో బీజేపీ నేత క్షీర సాగర్పై ఆయన చేయి చేసుకున్నట్లు ఫిర్యాదు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కాటేదాన్ పద్మ థియేటర్ వద్ద ఎంఐఎం-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు.