కారు ... బేకారు?
ఒకప్పుడు టొయోటా అంటే కారు. కారు అంటే టొయోటా. కానీ నాణ్యతాపరమైన సమస్యలు ఇప్పుడీ జాపనీస్ ఆటోమొబైల్ కంపెనీని చికాకు పెట్టేస్తున్నాయి. నాణ్యతాపరమైన సమస్యల వల్ల ఇప్పుడీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 63.9 లక్షల వాహనాలను వెనక్కు రప్పించేస్తోంది.
ఇంజన్ స్టార్టర్లలోని సమస్యల వల్ల అగ్నిప్రమాదాలు, యాక్సిడెంట్ల వల్ల ఆర్ ఏ వీ 4, కరోలా, యారిస్, మాట్రిక్స్, హైలాండర్ వంటి మోడల్స్ సహా మొత్తం 27 మోడల్స్ ను వెనక్కి రప్పిస్తోంది. విండ్ షీల్డ్ వైపర్ మోటార్స్, స్టీరింగ్ కాలమ్ బ్రాకెట్స్, ఇంజన్ స్టార్టర్లు, ఎయిర్ బాగ్స్కి కనెక్ట్ అయిన కేబుల్స్ వల్ల సమస్యలు వస్తున్నాయి. ఎయిర్ బ్యాగ్స్ సమస్యల వల్ల 35 లక్షల వాహనాలు, సీట్ రెయిల్స్ సమస్యల వల్ల 16.7 లక్షల వాహనాలను వెనక్కి రప్పిస్తోంది.
కొద్ది రోజుల క్రితమే జెనరల్ మోటార్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఇగ్నిషన్ స్విచ్చ సమస్య వల్ల 26 లక్షల వాహనాలను వెనక్కి రప్పించింది. మొత్తం మీద ఆటో రంగం అష్టకష్టాల్లో ఉంది.