Matrix
-
‘మ్యాట్రిక్స్’ ప్రసాద్ రీఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిమ్మగడ్డ ప్రసాద్.. మ్యాట్రిక్స్ ప్రసాద్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన ప్రముఖ వ్యాపారవేత్త. ఖాయిలాపడ్డ మ్యాట్రిక్స్ ల్యా»ొరేటరీస్ను 2000 సంవత్సరంలో ఆయన కొనుగోలు చేశారు. ఆరేళ్లలోనే బిలియన్ డాలర్ కంపెనీగా తీర్చిదిద్దారు. అప్పట్లో స్టాక్మార్కెట్లో మ్యాట్రిక్స్ ఓ సంచలనం. కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడించారు. ఫార్మా దిగ్గజం మైలాన్ ల్యాబ్స్ 2006లో మ్యాట్రిక్స్‌ను 1.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిచయం ఎందుకంటే తాను ఏ అమెరికా కంపెనీకి అయితే 17 ఏళ్ల క్రితం మ్యాట్రిక్స్‌ను విక్రయించారో.. ఇప్పుడు అదే మైలాన్ (ప్రస్తుతం వియాట్రిస్) నుంచి నిమ్మగడ్డ ప్రసాద్ తిరిగి ఆ వ్యాపారాన్ని కైవసం చేసుకుంటున్నారు. వియాట్రిస్‌కు చెందిన భారత ఏపీఐ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి నిమ్మగడ్డ ప్రసాద్ ప్రమోట్ చేస్తున్న ఐక్వెస్ట్ ఎంటర్ప్రైసెస్ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా పోటీపడి మరీ టెండర్లలో విజయం సాధించి వియాట్రిస్ ప్లాంట్లను ఐక్వెస్ట్ చేజిక్కించుకుంటోంది. ఏటా రూ.6,000 కోట్లు.. తాజా డీల్ పూర్తి అయితే హైదరాబాద్‌లో మూడు, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో మూడు భారీ స్థాయి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ (ఏపీఐ) తయారీ ప్లాంట్లతోపాటు హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఐక్వెస్ట్ చేతికి రానున్నాయి. అలాగే థర్డ్–పార్టీ ఏపీఐ విక్రయాలు కూడా సంస్థ పరం కానున్నాయి. ఈ డీల్ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పట్టొచ్చని అంచనా. ఆరు ప్లాంట్ల వార్షికాదాయం సుమారు రూ.6,000 కోట్లు ఉంది. ఈ ప్లాంట్లలో తయారైన ఉత్పత్తులను 10 ఏళ్లపాటు కొనుగోలు చేసేందుకు వియాట్రిస్ అంగీకరించింది. రానున్న రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఫార్మా కంపెనీగా ఆవిర్భవించనున్నట్టు ఐక్వెస్ట్ తెలిపింది. కాగా, భారత్‌లో మహిళల ఆరోగ్య సేవల వ్యాపారాన్ని స్పెయిన్‌కు చెందిన ఇన్సడ్ ఫార్మాకు వియాట్రిస్ విక్రయిస్తోంది. ఐక్వెస్ట్, ఇన్సడ్ డీల్స్ ద్వారా వియాట్రిస్‌కు సుమారు రూ.10,000 కోట్లు సమకూరుతున్నాయి. రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వియాట్రిస్ అంతర్జాతీయంగా వివిధ విభాగాల్లో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.29,950 కోట్లు అందుకుంటోంది. ఇదే అతిపెద్ద పెట్టుబడి.. ఫార్మాస్యూటికల్ రంగంలో తమ కంపెనీ నుంచి ఇదే అతిపెద్ద పెట్టుబడి అని ఐక్వెస్ట్ ఎంటర్ప్రైసెస్ ఈడీ, నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె గునుపాటి స్వాతి రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ ఔషధ పరిశ్రమలో భారత్ గణనీయంగా దృష్టిని ఆకర్షిస్తున్న సరైన సమయంలో ఈ డీల్ కుదుర్చుకున్నట్టు చెప్పారు. కాగా, ఏఐజీ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, సెలాన్ లే»ొరేటరీస్ తదితర సంస్థల్లో ఐక్వెస్ట్ ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్ గతంలో పెట్టుబడులు పెట్టి వీటి అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. సృజనాత్మక ఆలోచనలను విజయవంతమైన వ్యాపార వ్యూహాలుగా మార్చారు. కంపెనీలను వృద్ధి బాటలో నడిపించడంతోపాటు వాటాదారులకు మెరుగైన విలువను సృష్టించారు. 2012లో కేర్ హాస్పిటల్స్‌లో, 2015లో మా టీవీలో తనకున్న వాటాలను విక్రయించారు. మా టీవీని స్టార్ టీవీ సుమారు రూ.2,350 కోట్లకు కొనుగోలు చేయడం అప్పట్లో మీడియా రంగంలో సంచలనం కలిగించింది. -
పెరిగిన గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్.. హైదరాబాద్‌లో 108.2 మిలియన్ ఎస్ఎఫ్టీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో గ్రేడ్ ఏ ప్రీమియం కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లభ్యత మార్చి చివరికి 700 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) దాటింది. ఇందులో బెంగళూరు వాటా 28 శాతంగా ఉంది. ఈ వివరాలతో రియల్టర్ల సంఘం క్రెడాయ్, డేటా అనలైటిక్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా ఓ నివేదిక విడుదల చేశాయి. 2022 డిసెంబర్ నాటికి గ్రేడ్ ఏ ఆఫీసు స్థలాల నిల్వలు (లీజుకు అందుబాటులో ఉన్న) 692.91 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. (వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర) ఇక 2021 డిసెంబర్ నాటికి ఇది 643.84 ఎస్ఎఫ్టీ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. బెంగళూరులో 195.8 మిలియన్ ఎస్ఎఫ్టీ, ఢిల్లీ ఎన్సీఆర్లో 139.6 మిలియన్ చ.అడుగులు, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ లో 118.1 మిలియన్ చదరపు అడుగులు, హైదరాబాద్‌లో 108.2 మిలియన్ చదరపు అడుగులు, పుణెలో 72.4, చెన్నైలో 67.5 ఎస్ఎఫ్టీ చొప్పున గ్రేడ్ ఏ ప్రీమియం ఆఫీసు స్థలాల నిల్వలున్నాయి. స్థిరమైన డిమాండ్ మద్దతుతో 2030 నాటికి గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లభ్యత బిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. (రూ. 10వేల కోట్ల సుందర్ పిచాయ్ లగ్జరీ భవనం (ఫోటోలు)) కోవర్కింగ్ స్పేస్ 7 శాతం కోవర్కింగ్ స్పేస్ గత ఐదేళ్లలో అపార వృద్ధిని చూసిందని, ఇది 50 మిలియన్ చదరపు అడుగులు దాటినట్టు ఈ నివేదిక తెలిపింది. ఆరు పట్టణాల్లో మొత్తం ఆఫీసు స్థలాల్లో 7 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది. ‘‘దేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తుండడం అభినందనీయం. ఈ పెరుగుదలకు అనేక కారణాలను చెప్పొచ్చు. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉండడం, నూతన తరం పరిశ్రమల వృద్ధి, బహుళజాతి సంస్థల రాక పెరగడాన్ని చెప్పుకోవచ్చు. వినూత్నమైన కార్యాలయ డిజైన్లు, ప్రంపచస్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీ అనుసంధానత అన్నీ కలసి మన వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్‌ను ఆకర్షణీయంగా మార్చేస్తున్నాయి’’ క్రెడాయ్ ప్రెసిడెంట్ బోమన్ ఇరానీ తెలిపారు. ‘‘700 మిలియన్ ఎప్‌ఎఫ్‌టీ అంటే గణనీయమైనది. ఇందులో 25 శాతం గత ఐదేళ్ల కాలంలో అందుబాటులోకి వచి్చందే. డెవలపర్లు భవన నిర్మాణాల్లో ఎంతో వినూత్నతతో, ఈఎస్జీని దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు’’అని సీఆర్ఈ మ్యాట్రిక్స్, ఇండెక్స్ ట్యాప్ సీఈవో అభిõÙక్ కిరణ్ గుప్తా తెలిపారు. -
ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్
Priyanka Chopra Shares The Matrix Resurrections New Poster: హాలీవుడ్ 'మ్యాట్రిక్స్' మూవీ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం విడుదల కోసం ఇండియన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో హాలీవుడ్ స్టార్ కీన్ రీవ్స్‌తో పాటు క్యారీ-అన్నె మోస్, జడా పింకెట్ స్మిత్, యహ్యా అబ్దుల్ మాటీన్ 2, జోనాథన్ గ్రోఫ్ ఉన్నారు. ఈ పోస్టర్ షేర్ చేస్తూ ప్రియాంక 'ఈ మ్యాట్రిక్స్ రిసరెక్షన్ కొత్త పోస్టర్‌తో తిరిగి మ్యాట్రిక్స్‌లోకి అడుగు పెట్టండి. ఈ క్రిస్మస్కి థియేటర్లలో, హెచ్‌బీవో మ్యాక్స్‌లో చూడండి.' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) భారతీయ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా పోస్టర్లో ప్రియాంక కనిపించకపోయేసరికి ప్రశ్నలు కురిపించిసాగారు. 'పోస్టర్లో మీరు ఎక్కడ ఉన్నారు' అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. 'మిమ్మల్ని చూసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం' అని మరోకరు రాశారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రియాంక నల్లటి షేడ్స్ ధరించి రెప్పపాటు క్షణంలో కనిపిస్తారు. మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ నాల్గో సినిమాను లానా వాచోస్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెబంర్ 22న థియేటర్స్, హెచ్‌బీవో (HBO) మ్యాక్స్‌లో విడుదల కానుంది. -
యాక్షన్‌కి సిద్ధం
‘ఈజింట్ ఇట్ రొమాంటిక్, బే వాచ్, ఎ కిడ్ లైక్ జేక్’ సినిమాల తర్వాత నాలుగో హాలీవుడ్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘మ్యాట్రిక్స్’ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రంలో హీరోయిన్గా ప్రియాంకా చోప్రాను తీసుకున్నారని సమాచారం. కీనూ రీవెస్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘మ్యాట్రిక్స్’ సినిమాలు యాక్షన్ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలోని ముఖ్యపాత్రల్లో నటించే నటులందరూ మూడు వారాలుగా యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నారు. త్వరలోనే ప్రియాంక కూడా ఈ టీమ్‌తో కలసి శిక్షణలో పాల్గొంటారట. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రియాంక చోప్రా హాలీవుడ్ కెరీర్లో మలుపు తిప్పేదిగా ఉంటుందని ఊహించవచ్చు. -
దానిని ముందే గుర్తించవచ్చా?
మా బంధువులలో ఒకరికి గర్భాశయ క్యాన్సర్ వచ్చింది. ఇది విన్నప్పటి నుంచి నాకు భయంగా ఉంది. ఇది ముందుగానే గుర్తించే అవకాశం ఉందా? పాప్‌స్మియర్ టెస్ట్ గురించి తెలియజేయగలరు. గర్భాశయ క్యాన్సర్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి: గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్. దీనిని సర్వికల్ క్యాన్సర్ అంటారు. రెండోది గర్భాశయం లోపలి పొరలో వచ్చేది. దీనిని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. పాప్ స్మియర్ అనే పరీక్షలో గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) దగ్గర నుంచి నీరు తీసి, దానిలోని కణాలను మైక్రోస్కోప్‌లో చూడటం జరుగుతుంది. సర్విక్స్ దగ్గర కణాలలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, క్యాన్సర్‌గా మారే కణాలు కనిపిస్తున్నాయా అనేది చూడటం జరుగుతుంది. పాప్ స్మియర్లో క్యాన్సర్ రాక ముందు పదేళ్ల ముందు నుంచే మార్పులు తెలుస్తాయి. ఇది ప్రతి మూడేళ్లకు ఒకసారి చేయించుకోవడం మంచిది. సర్వికల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల తొలిదశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. లక్షణాలు కనిపించేటప్పటికి అది ముదిరి, చుట్టుపక్కల అవయవాలకు పాకే అవకాశం ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలలో భాగంగా కొందరిలో అధికంగా తెల్లబట్ట, అందులో కొద్దిగా బ్లీడింగ్ కనిపించడం, కలయిక తర్వాత బ్లీడింగ్, అధిక రక్తస్రావం, నెల మధ్యలో కూడా బ్లీడింగ్, పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశ తర్వాత కూడా బ్లీడింగ్ వంటివి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగ ఉండవచ్చు. ఇటువంటి లక్షణాలు గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, పుండ్లు, గడ్డలు, పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్ సిస్ట్స్ వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్ పరీక్ష, పాప్ స్మియర్, ట్రాన్స్ వజైనల్ స్కానింగ్ వంటివి చేయించుకుని, ఏదైనా తేడాగా అనిపించినప్పుడు ఎండోమెట్రియల్ బయాప్సీ, సర్వైకల్ బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకుంటే, అది హార్మోన్ల మార్పులా లేక క్యాన్సర్ మార్పులా అనేది నిర్ధారణ జరుగుతుంది. ఏదైనా క్యాన్సర్ గాని, క్యాన్సర్ మార్పులు గాని మొదట్లోనే కనుగొంటే అది మామూలు ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు. నేను ప్రెగ్నెంట్. ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని ఒకరు చెప్పారు. దీని వల్ల ఉపయోగం ఏమిటో తెలియజేయగలరు. ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే బిడ్డ పుట్టక ముందే, గర్భంలో ఉన్నప్పుడే బిడ్డలోని కొన్ని రకాల జన్యు సమస్యలు, అవయవ లోపాలు ఉండే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో తెలుసుకోవడానికి చేసే పరీక్షలు. పది వారాల నుంచి పన్నెండు వారాల లోపల డబుల్ మార్కర్ టెస్ట్ అని తల్లి రక్తం తీసుకుని, అందులో బీహెచ్‌సీజీ, పాపె అనే బయోకెమికల్ మార్కర్స్ ఉండే సంఖ్యను బట్టి, బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ వంటి కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో విశ్లేషించడం జరుగుతుంది. దీంతో పాటు పన్నెండు వారాల సమయంలో న్యూకల్ ట్రాన్స్‌లూసెన్సీ (ఎన్టీ) స్కాన్ చేయడం వల్ల ఆ సమయానికి బిడ్డలో కొన్ని అవయవ లోపాలు ఉంటే తెలుస్తాయి. అలాగే ముక్కు, మెడ వెనుక భాగంలో చర్మం మందాన్ని (న్యూకల్ థిక్నెస్) బట్టి బిడ్డలో జన్యుపరమైన లోపాలు, ఇతర సమస్యలు ఏ మేరకు ఉన్నాయో తెలుస్తుంది. పదహారు నుంచి ఇరవై వారాల లోపల క్వాడ్రుపుల్ టెస్ట్ ద్వారా కూడా కొన్ని జన్యుపరమైన సమస్యలు ఎంతవరకు ఉన్నాయో తెలుస్తుంది. పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల లోపల ‘టిఫా’ స్కానింగ్‌లో బిడ్డలో అవయవ లోపాలు ఉంటే 95 శాతం మేరకు తెలుస్తాయి. ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్‌లో కచ్చితంగా సమస్య ఉందని నిర్ధారించడం జరగదు. అయితే, సమస్య ఉండే అవకాశాలు ఎంత మేరకు ఉండవచ్చనేది మాత్రమే తెలుస్తుంది. సమస్య నిర్ధారించడానికి పదకొండు నుంచి పద్నాలుగు వారాల లోపల అయితే కొరియానిక్ విలస్ బయాప్సీ, పదహారు వారాల తర్వాత అయితే అమ్నియోసెంటెసిస్ అంటే బిడ్డ చుట్టూ ఉమ్మనీరు తీసి కారియోటైపింగ్ వంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇందులో డౌన్స్ సిండ్రోమ్ వంటి కొన్ని రకాల జన్యు సమస్యలు నిర్ధారణ అవుతాయి. కాకపోతే, ఈ నిర్ధారణ పరీక్షలు చేసేటప్పుడు వందమందిలో ఒకరికి అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్ట్‌లకు, నిర్ధారణ పరీక్షలకు వ్యత్యాసం తెలుసుకోవాలి. పీఆర్పీ థెరపీని ముఖానికి, జుట్టుకి వాడతారని విన్నాము. ఈ మధ్య దీనిని గైనకాలజీలో కూడా వాడుతున్నారని తెలిసింది. దీని గురించి వివరించగలరు. పీఆర్పీ– అంటే, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఒక మనిషి రక్తం 20–30 మిల్లీలీటర్లు తీసుకొని, దానిని సెంట్రిఫ్యూజ్ అనే పరికరంలో వేసి తిప్పినప్పుడు ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు విడిపోయి, ప్లేట్లెట్స్ ఉన్న ప్లాస్మా మాత్రమే పైకి తేలుతుంది. ఇందులో గ్రోత్ ఫ్యాక్టర్స్, సైటోకైన్స్ ఉంటాయి. దీనిని శరీర భాగాల్లోకి ఇంజెక్షన్ ద్వారా పంపించినట్లయితే, ఆయా భాగాల్లో గ్రోత్ ఫ్యాక్టర్స్, ఫైబ్రోబ్లాస్ట్లు పెరిగి, కొల్లాజెన్ టిష్యూ వృద్ధి చెందుతుంది. రక్తప్రసరణ పెరుగుతుంది. ఇప్పటి వరకు ముఖంపై చర్మం కోసం, జుట్టు పెరగడానికి, ఇంకా ఇతర భాగాల్లోను దీనిని వాడటం జరుగుతుంది. ఇది స్టెమ్సెల్స్లాగా పనిచేసి కొత్త కణజాలం పెరగడానికి దోహదపడుతుంది. ఇందులో ఎవరి రక్తాన్ని వాళ్లకే ఇంజెక్షన్ ద్వారా పంపడం జరుగుతుంది కాబట్టి దుష్ఫలితాలు తలెత్తే అవకాశాలు చాలావరకు ఉండవు. దీనిని ఇప్పుడు గైనకాలజీ విభాగంలోనూ ఉపయోగించడం జరుగుతోంది. కాన్పుల వల్ల యోని వదులైనప్పుడు పీఆర్పీ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల అక్కడ కణజాలం పెంపొంది, యోని కొద్దిగా బిగుతుగా అయినట్లు అనిపిస్తుంది. అలాగే సెక్స్ ప్రేరేపణలకు క్లిటోరిస్ భాగంలోను, యోనిలోని జీస్పాట్ భాగంలోను ఇవ్వడం వల్ల కొందరిలో కొద్దిగా ఉపయోగం ఉండవచ్చు. దీనిని ‘ఓ–షాట్’ అంటారు. మూత్రాశయ కండరాలు వదులయ్యి, దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్ అయ్యేవారిలో పీఆర్పీ థెరపీ ద్వారా యూరెత్రా కింద పీఆర్పీని ఇంజెక్ట్ చేయడం వల్ల అక్కడ కణజాలం వృద్ధి చెంది, రక్తప్రసరణ పెరిగి కొందరిలో కాస్త ఉపశమనం దొరుకుతుంది. పీఆర్పీతో పాటు హైలురోనిక్ యాసిడ్ వంటి కొన్ని ద్రవాలను, పదార్థాలను కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారిలో గర్భాశయ పొర బాగా పలచగా ఉన్నప్పుడు, దానిని ప్రేరేపించడానికి పీఆర్పీని గర్భాశయంలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అండాశయాలలో అండాలు బాగా తగ్గిపోయినప్పుడు అండాలను పెంపొందించడానికి అండాశయాలలో ఇంజెక్ట్ చేయడం ద్వారా కొందరిలో కొత్తగా అండాలు తయారయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి పీఆర్పీ థెరపీ నెల వ్యవధిలో 3–4 సార్లు చెయ్యాల్సి ఉంటుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
తొమ్మిదేళ్ల పార్టనర్ కు సల్మాన్ బ్రేకప్
ముంబై :బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, తన తొమ్మిదేళ్ల బిజినెస్ పార్టనర్ తో తెగదెంపులు చేసుకున్నాడు. టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ మ్యాట్రిక్స్ తో సల్మాన్ తన బిజినెస్ ఒప్పందాలను విరమించుకున్నట్టు ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు చేసింది. రెష్మా శెట్టి ఈ టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని రన్ చేస్తోంది. అయితే సల్మాన్ తో బిజినెస్ డీల్స్ సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలని రెష్మాశెట్టి కోరుకున్నట్టు తెలిసింది. కానీ సల్మాన్ మ్యాట్రిక్స్ తో తన బిజినెస్ ఒప్పందాలను తెగదెంపులకే మొగ్గుచూపినట్టు వెల్లడైంది. అయితే వారి మధ్య సంబంధాలు చెడిన విషయాన్ని ఇరుపక్షాలు తోసిపుచ్చాయి. ఇరు పక్షాల అంగీకారంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న కాంట్రాక్ట్ లకు మ్యాట్రిక్స్ సేవలందిస్తుందని, ఆ డీల్స్ కు స్వస్తి చెప్పడానికి జరిపే చర్చలు ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయని రిపోర్టు తెలిపింది. సల్మాన్ తన బిజినెస్ ఒప్పందాల కోసం మ్యాట్రిక్స్ ను నియమించుకోక ముందు, తన వ్యాపారాలన్నింటిన్నీ ఆయన కుటుంబమే చూసుకునేంది. వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫాంలో ఉన్న సల్మాన్ ఖాన్, సినిమాలతో పాటు వ్యాపార రంగంపైనే అమితాసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. బీయింగ్ హ్యూమన్ పేరుతో పలు ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న సల్మాన్, తాజాగా మొబైల్ బ్రాండ్ ను కూడా లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. -
కారు ... బేకారు?
ఒకప్పుడు టొయోటా అంటే కారు. కారు అంటే టొయోటా. కానీ నాణ్యతాపరమైన సమస్యలు ఇప్పుడీ జాపనీస్ ఆటోమొబైల్ కంపెనీని చికాకు పెట్టేస్తున్నాయి. నాణ్యతాపరమైన సమస్యల వల్ల ఇప్పుడీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 63.9 లక్షల వాహనాలను వెనక్కు రప్పించేస్తోంది. ఇంజన్ స్టార్టర్లలోని సమస్యల వల్ల అగ్నిప్రమాదాలు, యాక్సిడెంట్ల వల్ల ఆర్ ఏ వీ 4, కరోలా, యారిస్, మాట్రిక్స్, హైలాండర్ వంటి మోడల్స్ సహా మొత్తం 27 మోడల్స్ ను వెనక్కి రప్పిస్తోంది. విండ్ షీల్డ్ వైపర్ మోటార్స్, స్టీరింగ్ కాలమ్ బ్రాకెట్స్, ఇంజన్ స్టార్టర్లు, ఎయిర్ బాగ్స్కి కనెక్ట్ అయిన కేబుల్స్ వల్ల సమస్యలు వస్తున్నాయి. ఎయిర్ బ్యాగ్స్ సమస్యల వల్ల 35 లక్షల వాహనాలు, సీట్ రెయిల్స్ సమస్యల వల్ల 16.7 లక్షల వాహనాలను వెనక్కి రప్పిస్తోంది. కొద్ది రోజుల క్రితమే జెనరల్ మోటార్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఇగ్నిషన్ స్విచ్చ సమస్య వల్ల 26 లక్షల వాహనాలను వెనక్కి రప్పించింది. మొత్తం మీద ఆటో రంగం అష్టకష్టాల్లో ఉంది.