తొమ్మిదేళ్ల పార్టనర్ కు సల్మాన్ బ్రేకప్
తొమ్మిదేళ్ల పార్టనర్ కు సల్మాన్ బ్రేకప్
Published Sat, Apr 8 2017 5:03 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
ముంబై :బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, తన తొమ్మిదేళ్ల బిజినెస్ పార్టనర్ తో తెగదెంపులు చేసుకున్నాడు. టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ మ్యాట్రిక్స్ తో సల్మాన్ తన బిజినెస్ ఒప్పందాలను విరమించుకున్నట్టు ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు చేసింది. రెష్మా శెట్టి ఈ టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని రన్ చేస్తోంది. అయితే సల్మాన్ తో బిజినెస్ డీల్స్ సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలని రెష్మాశెట్టి కోరుకున్నట్టు తెలిసింది. కానీ సల్మాన్ మ్యాట్రిక్స్ తో తన బిజినెస్ ఒప్పందాలను తెగదెంపులకే మొగ్గుచూపినట్టు వెల్లడైంది. అయితే వారి మధ్య సంబంధాలు చెడిన విషయాన్ని ఇరుపక్షాలు తోసిపుచ్చాయి. ఇరు పక్షాల అంగీకారంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి.
ప్రస్తుతం నడుస్తున్న కాంట్రాక్ట్ లకు మ్యాట్రిక్స్ సేవలందిస్తుందని, ఆ డీల్స్ కు స్వస్తి చెప్పడానికి జరిపే చర్చలు ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయని రిపోర్టు తెలిపింది. సల్మాన్ తన బిజినెస్ ఒప్పందాల కోసం మ్యాట్రిక్స్ ను నియమించుకోక ముందు, తన వ్యాపారాలన్నింటిన్నీ ఆయన కుటుంబమే చూసుకునేంది. వరుస సక్సెస్లతో ఫుల్ ఫాంలో ఉన్న సల్మాన్ ఖాన్, సినిమాలతో పాటు వ్యాపార రంగంపైనే అమితాసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. బీయింగ్ హ్యూమన్ పేరుతో పలు ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న సల్మాన్, తాజాగా మొబైల్ బ్రాండ్ ను కూడా లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement