
ప్రియాంకా చోప్రా
‘ఈజింట్ ఇట్ రొమాంటిక్, బే వాచ్, ఎ కిడ్ లైక్ జేక్’ సినిమాల తర్వాత నాలుగో హాలీవుడ్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘మ్యాట్రిక్స్’ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రాను తీసుకున్నారని సమాచారం. కీనూ రీవెస్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘మ్యాట్రిక్స్’ సినిమాలు యాక్షన్ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలోని ముఖ్యపాత్రల్లో నటించే నటులందరూ మూడు వారాలుగా యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నారు. త్వరలోనే ప్రియాంక కూడా ఈ టీమ్‌తో కలసి శిక్షణలో పాల్గొంటారట. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రియాంక చోప్రా హాలీవుడ్ కెరీర్‌లో మలుపు తిప్పేదిగా ఉంటుందని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment