
‘‘వృత్తిపరమైన గాయాలను తప్పించుకోలేం. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు గాయాలు తప్పవు’’ అంటున్నారు ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’లో నటిస్తున్నారు. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ మూవీ షూటింగ్ ఇటీవల ఆస్ట్రేలియాలో ఆరంభమైంది.
ఈ చిత్రం కోసం ప్రియాంకా చోప్రా పాల్గొనగా పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆమె పెదవి, ముక్కు, మెడకు గాయాలు అయ్యాయి. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ప్రోఫెషనల్ లైఫ్‌లో జరిగే ప్రమాదాలు’ అంటూ వీడియో పోస్ట్ చేశారు ప్రియాంక. ఇక గాయాలు కాగానే షూటింగ్ ఆపేసి, ఆమెను సిడ్నీలోని ఆస్పత్రికి తీసుకెళ్లిందట యూనిట్. అక్కడ చికిత్స చేయించుకుని, విశ్రాంతి తీసుకుంటున్నారట ప్రియాంకా చోప్రా.
Comments
Please login to add a commentAdd a comment