Priyanka Chopra And Nick Prepared Special House of Rs 149 crore House For Children, Deets Inside - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: పిల్ల‌ల కోసం నిక్యాంక ఏం చేశారంటే?

Published Thu, Jan 27 2022 11:33 AM | Last Updated on Thu, Jan 27 2022 12:57 PM

Priyanka Chopra And Nick Prepared Special House of Rs 149 crore House For Children - Sakshi

గ్లోబ‌ల్ స్టార్ క‌పుల్‌ ప్రియాంక చోప్రా- నిక్ జోన‌స్ ఇటీవ‌లే స‌రోగ‌సి ద్వారా పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే! అయితే ఈ జంట త‌మ పిల్ల‌ల కోసం ఇప్ప‌టికే ఓ ఖ‌రీదైన ఇంటిని సిద్ధం చేశార‌ట‌. ఈ మేర‌కు హాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వెలువడుతున్నాయి. పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని సుమారు మూడేళ్ల‌ క్రిత‌మే రూ.149 కోట్లు ఖ‌ర్చు పెట్టి ఇంటిని సొంతం చేసుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని పీపుల్స్ మ్యాగ‌జైన్ ఒక ప్ర‌త్యేక క‌థ‌నంలో ప్ర‌చురించింది.

కాగా నిక్యాంక 2018లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. ఆ మ‌రుస‌టి ఏడాది అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సెటిల్ అయ్యారు. పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని వారికోసం అక్క‌డ‌ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేశారు. దాని ఖ‌రీదు 20 మిలియ‌న్ డాల‌ర్లు.. అంటే భార‌త క‌రెన్సీలో దాదాపు రూ.149 కోట్లు అని తెలుస్తోంది. ఆ ఇంటికోసం దంప‌తులు మూడు నెల‌ల‌పాటు శ్ర‌మించి అన్నీ త‌మ‌కు న‌చ్చేలా అమ‌ర్చుకున్నార‌ట‌. త‌మ పిల్ల‌ల‌తో గ‌డిపే ప్ర‌తి క్ష‌ణం మ‌ధుర జ్ఞాప‌కంగా నిల‌వాల‌న్న‌ది వారి కోరిక అని, అందుకే ఇంత భారీ మొత్తంలో ఖ‌ర్చు పెట్టి ఆ ఇంటిని కొనుగోలు చేశార‌ని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement