ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌యూవీ 700 కార్ల ఇంజన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్‌లో లోపాల్ని గుర్తించింది. వెంటనే ఈ సమస్య ఉన్న కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, 2021 జూన్ 8 నుంచి 2023 జూన్ 28 మధ్య తయారైన మొత్తం 1,08,306 కార్లలో ఈ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎక్స్‌యూవీ 700తో పాటు, ఎక్స్‌యూవీ 400 ఎస్‌యూవీలను సైతం రీకాల్ చేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. 2023 ఫిబ్రవరి 16 నుంచి 2023 జూన్ 5 మధ్య తయారైన 3,560 కార్లలో బ్రేక్ పొటెన్షియోమీటర్‌లో స్ప్రింగ్ రిటర్న్ యాక్షన్‌లో లోపాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ కార్లను సైతం వెనక్కి రప్పిస్తున్నట్లు మహీంద్రా తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కార్లలో సమస్యల్ని గుర్తించి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా బాగు చేసి కస్టమర్లకు అందిస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment