
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాను రీకాల్ చేయాలని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్‌సీ) నిర్ణయించింది. అవినీతి ఆరోపణలతో నిండా మునిగిన జుమా రాజీనామాకు నిరాకరించటంతో సోమవారం ఏఎన్‌సీ అత్యున్నత స్థాయి భేటీ జరిపింది. దాదాపు 13 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత జుమాను సాగనంపాలని తీర్మానించింది. అయితే, ఇందుకు గడువేదీ విధించలేదు.
ఈ మేరకు జుమాకు ఏఎన్‌సీ లేఖ రాయనున్నట్లు సమాచారం. రాజీనామాకు అంగీకరించిన జుమా 6 నెలలు కొనసాగాలని భావిస్తున్నట్లు ఏఎన్‌సీ ప్రధాన కార్యదర్శి మగషులే తెలిపారు. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం కారణాలతో జుమాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడటంతో పార్లమెంట్‌ను రద్దుచేసి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment