Jacob Zuma
-
దక్షిణాఫ్రికా దక్కేదెవరికో?
సియాంకొబా. దక్షిణాఫ్రికాలో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఊరూవాడా హోరెత్తించిన ఎన్నికల నినాదం. అంటే ‘మాదే ఘనవిజయం’ అని జులు భాషలో అర్థం. కానీ ఘనవిజయం దేవుడెరుగు, ఏఎన్సీ ఈసారి సాధారణ మెజారిటీ సాధించడం కూడా కష్టమేనని ఒపీనియన్ పోల్స్ అంటున్నాయి. వర్ణవివక్ష అంతమై తెల్లవారి పాలన ముగిశాక 1994లో ప్రజాస్వామిక పద్ధతిలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచింది మొదలు 30 ఏళ్లుగా ఏఎన్‌సీయే అధికారంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో దానికి తొలిసారి గట్టి పోటీ ఎదురవుతోంది... దక్షిణాఫ్రికాలో ఎన్నికలకు వేళైంది. 400 మందితో కూడిన నేషనల్ అసెంబ్లీతో పాటు 9 ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు కూడా బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా ఏడో విజయం కోసం ఏఎన్సీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కానీ పెచ్చరిల్లుతున్న అవినీతి, నిరుద్యోగం, కరెంటు కోతలు, నీటి కొరత, మౌలిక సదుపాయాల లేమి వంటివి పారీ్టకి బాగా ప్రతికూలంగా మారాయి. వీటిపై ప్రజాగ్రహం ప్రచారం పొడవునా స్పష్టంగా కన్పించింది. శనివారం అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్వహించిన చివరి ప్రచార సభ కూడా అనుకున్నంతగా విజయవంతం కాలేదు. సభకు వేదికైన చారిత్రక సొవెటో టౌన్‌షిప్‌లోని 90వేల మంది సామర్థ్యమున్న ఫుట్‌బాల్ స్టేడియం పూర్తిగా నిండకపోవడం ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి అద్దం పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. 71 ఏళ్ల రామఫోసాపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఆయనను అభిశంసించాలని పార్లమెంట్ నియమించిన న్యాయ నిపుణుల కమిటీ కూడా సూచించింది. అయితే పార్లమెంట్లో ఉన్న మెజారిటీ సాయంతో ఆ ప్రక్రియను ఏఎన్సీ అడ్డుకుంది. రామఫోసాపై జరిగిన పోలీసు దర్యాప్తు వివరాలు బయటకు రాలేదు. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి ఏఎన్సీ తన చరిత్రలో తొలిసారిగా 50 శాతం కంటే తక్కువ ఓట్లకు పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అదే జరిగితే అతి పెద్ద పారీ్టగా నిలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దక్కదు. ఏఎన్సీ ఈసారి ఇతర పారీ్టల మద్దతుపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుందని సర్వేలూ పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఆదివారం వెల్లడ య్యే ఫలితాలపైనే నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ జాకబ్ జుమా పంచ్... మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా గతేడాది రామఫోసాతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడం ఏఎన్‌సీకి పెద్ద దెబ్బ! 82 ఏళ్ల జుమా ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరాడుతున్నారు. ఆయన పార్టీ ఉంకొంతో వెసీజ్వె (ఎంకే) 13 శాతం దాకా ఓట్లు రాబట్టవచ్చని సర్వేల్లో వెల్లడయ్యింది. అధికారంలోకి రాకపోయినా ఏఎన్సీ అవకాశాలను బాగా దెబ్బ తీయడం ఖాయమని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా జుమా సొంత ప్రావిన్స్ క్వాజులూ నాటాల్లో ఏఎన్సీ ఆధిపత్యానికి ఎంకే పూర్తిగా గండికొట్టనుందని అంటున్నారు. క్వాజులూ ప్రావిన్స్‌లోని ఎంకే నేతల్లో తెలుగు మూలాలున్న విశి్వన్ గోపాల్‌రెడ్డి ప్రముఖ స్థానంలో ఉండటం విశేషం.బరిలో 51 విపక్షాలు దక్షిణాఫ్రికాలో ప్రధాన ప్రతిపక్షం డెమొక్రటిక్ అలయెన్స్ (డీఏ). ఈ కూటమికి 22 నుంచి 27 శాతం ఓట్లు రావచ్చని ఏప్రిల్‌లో ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అయితే పలువురు నేతలు డీఏను వీడి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఇది విపక్ష కూటమికి ప్రతికూలంగా మారింది. ఈసారి 51 ప్రతిపక్షాలు పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఏఎన్‌సీకి కలిసొచ్చేలా కని్పస్తోంది.ముస్లిం ఓట్లపై వల... జనాభాలో ముస్లింలు 2 శాతం కంటే తక్కువే ఉంటారు గానీ వారి ప్రతి ఓటూ విలువైనదే. అందుకే ముస్లింల ఓట్లపై పారీ్టలు వల విసురుతున్నాయి. పాలస్తీనా ఉద్యమానికి పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. గాజాలో దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన సమస్యలివీ... → తీవ్ర కరెంటు కోతలు → పెచ్చరిల్లిన అవినీతి → పేదరికం (50 శాతం దాటింది) → 32 శాతం దాటిన నిరుద్యోగం (ప్రపంచంలోనే అత్యధికం) → తీవ్ర నీటి కొరత → మౌలిక సదుపాయాల లేమి → మితిమీరిన నేరాలు, హింసాకాండ → రాజకీయ హత్యలుదక్షిణాఫ్రికా పార్లమెంటులో రెండు సభలుంటాయి. 90 మంది సభ్యులతో కూడిన నేషనల్ కౌన్సిల్, 400 మంది సభ్యులుండే నేషనల్ అసెంబ్లీ. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో దీని సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మెజారిటీ సాధించే పార్టీ సారథి అధ్యక్షుడవుతారు. దేశ జనాభా 6.2 కోట్లు కాగా ఓటర్లు 2.8 కోట్ల మంది. జనాభాలో 80 శాతానికి పైగా నల్లజాతీయులే. ఈ ఎన్నికల్లో తొలిసారిగా స్వతంత్రులకు కూడా పోటీ చేసే అవకాశం కలి్పంచారు.ఎన్నికల నేపథ్యంలో దక్షిణాఫ్రికావ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ హత్యలు కలకలం సృస్టిస్తున్నాయి. 2023 జనవరి నుంచి 40 మందికి పైగా విపక్ష నేతలు, నిజాయతీపరులైన అధికారులు, హక్కుల కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఇది అధ్యక్షుడు రామఫోసా పనేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రచారంలో దీన్ని ప్రధానాంశంగా కూడా మార్చుకున్నాయి. వీటిపై ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నేషనల్ అసెంబ్లీలో బలాబలాలు (మొత్తం స్థానాలు 400) ఏఎన్సీ 230 డెమొక్రటిక్ అలయన్స్ 84 ఎకనమిక్ ఫ్రీడం ఫైటర్స్ 44 ఇతరులు 42 -
దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేసిన... గుప్తా బ్రదర్స్ చిక్కారు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో భారీ అవినీతికి కేంద్రంగా మారి, అప్పటి అధ్యక్షుడు జాకబ్ జుమా పదవీ చ్యుతికి కారకులై దుబాయ్ పారిపోయిన భారత సంతతి వ్యాపారవేత్తలు గుప్తా బ్రదర్స్ ఎట్టకేలకు చట్టానికి చిక్కారు. రాజేశ్ గుప్తా (51), అతుల్ గుప్తా (53)లను సోమవారం దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని దక్షిణాఫ్రికా రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆ దేశ నేషనల్ ప్రాసిక్యూటింగ్ అధికారి వెల్లడించారు. మూడో సోదరుడు అజయ్ గుప్తా అరెస్టుపై స్పష్టత లేదన్నారు. ఈ పరిణామాన్ని దక్షిణాఫ్రికా విపక్ష ప్రతిపక్ష డెమొక్రాటిక్ అలయన్స్ స్వాగతించింది. విచారణ త్వరగా ముగించాలని కోరింది. చెప్పుల వ్యాపారంతో మొదలై... ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు చెందిన అజయ్, అతుల్, రాజేశ్ గుప్తా సోదరులు 90వ దశకంలో దక్షిణాఫ్రికా వెళ్లి చెప్పుల దుకాణం ప్రారంభించారు. చూస్తుండగానే ఐటీ, మీడియా, మైనింగ్ వంటి రంగాలకు వ్యాపారాన్ని విస్తరించడమేకాదు చాలా తక్కువ కాలంలోనే దక్షిణాఫ్రికాలో కుబేరులుగా అవతరించారు. అధ్యక్షుడు జాకబ్ జుమాతో సాన్నిహిత్యంతో 2009–18 మధ్య గుప్తా బ్రదర్స్ ఆర్థికంగా బాగా లాభపడ్డారు. నేషనల్ ఎలక్ట్రిసిటీ సప్లయర్ ‘ఎస్కాం’ వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలను కొల్లగొట్టారు. మంత్రుల దగ్గర్నుంచి పలు నియామకాలను ప్రభావితం చేశారంటారు. 2016లో ఆర్థిక మంత్రి కావడానికి వీరు 44 మిలియన్ల డాలర్ల లంచం ఆఫర్ చేశారని ఒక అధికారి చెప్పారు. దాంతో వీరి అవినీతి బాగా వెలుగులోకి వచ్చింది. చదవండి: (తల్లిదండ్రుల పేరుతో బస్టాండ్) 2018 కల్లా ప్రజా నిరసనలు తీవ్రతరమై చివరికి జుమా తప్పుకోవాల్సి వచ్చింది. జుమా హయాంలో ప్రభుత్వ సంస్థలను వేల కోట్ల రూపాయలకు ముంచేసినట్టు గుప్తా బద్రర్స్‌పై ఆరోపణలున్నాయి. మొత్తమ్మీద 15 బిలియన్ రాండ్లు (రూ.7,513 కోట్లు) కొల్లగొట్టారన్న అభియోగంపై విచారణ సాగుతుండగానే వారు కుటుంబాలతో సహా దుబాయి పారిపోయారు. వారి ఆస్తుల్లో చాలావరకు విక్రయించడమో, మూసేయడమో జరిగింది. దక్షిణాఫ్రికా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడంతో రాజేశ్, అతుల్ సోదరులపై గత జూన్‌లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. 15 బిలియన్ ర్యాండ్లు దోచుకున్నారన్నది నిజమేనని తేలినట్టు ఆర్గనైజేషన్ అన్‌డూయింగ్ ట్యాక్స్ అబ్యూస్ సీఈఓ వేన్ డువెన్‌హేజ్ తెలిపారు. -
తగలబడుతున్న బంగారు నేల.. ఊళ్లోకి క్రూరమృగాలు?
ఎటు చూసినా గుంపులుగా జనం, దొపిడీలు, తగలబడుతున్న కాంప్లెక్స్, మిగిలిపోయిన శిథిలాలు.. బంగారు నేల దక్షిణాఫ్రికా అల్లకల్లోలంగా తయారైంది. కరోనాతో దీనావస్థకు చేరిన జనాల్లో, మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమా అరెస్ట్‌తో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిరసనకారులు కొందరు రొడ్డెక్కి విధ్వంసం సృష్టిస్తుండగా.. ఇదే అదనుగా దొపిడీలకు పాల్పడుతున్నారు అక్కడి జనాలు. ఈ క్రమంలో క్రూరమృగాల సంచారం వార్తలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సాక్క్షి, వెబ్‌డెస్క్: తర్గత సంక్షోభంతో దక్షిణాఫ్రికా పరిస్థితి అధ్వానంగా తయారైంది. కరోనా మూడో వేవ్ మధ్యలో కొట్టుమిట్టాడడం, మునుపెన్నడూ లేనంతగా పెరిగిన నిరుద్యోగం-పేదరికం రేటు జనాలకు నిరసనలు బలాన్నిచ్చాయి. ఒక్కసారిగా రోడ్ల మీద పడి దొపిడీలకు పాల్పడ్డారు. వయసు భేధాల్లేకుండా ఆహారం, లిక్కర్, డబ్బులు, మందులు.. ఇలా అన్నీ దొంగతనం చేస్తున్నారు. పనిలో పనిగా కాంప్లెక్స్‌లను తగలబెడుతున్నారు. ఇప్పటిదాకా 212 మంది ప్రాణాలు పొగొట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీళ్లలో చాలామంది దొపిడీలకు పాల్పడినప్పుడు తొక్కిసలాటలోనే చనిపోయారని తెలిపింది. డర్బన్, పీయెటెర్ మార్టిజ్బర్గ్ల్లో జుమా గతంలో పోటీ చేసిన క్వాజులు నాటల్, గౌటెంగ్లలో ఈ విధ్వంసం భారీగా కొనసాగుతోంది. ఈ రెండు ప్రావిన్స్‌ల్లో ఇప్పటిదాకా సుమారు 2500 మందిని అరెస్ట్ చేశారు. వీధుల్లోకి మృగాలు ఇక ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని హ్లూహ్లూవే రిజర్వ్ కంచెను తెంచేయడంతో.. సింహాలు, ఖడ్గమృగాలు, ఏనుగులు, చిరుత పులులు రోడ్ల మీదకు దూసుకొచ్చినట్లు కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటిలో చాలావరకు పాతవని అధికారులు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం.. ‘‘జంతువులు సంచరించిన మాట వాస్తవమేనని, అది తరచూ జరిగేదేనని, కానీ, సంబంధం లేకుండా కొందరు వాటిని అల్లర్లతో ముడిపెడుతున్నారని, సౌతాఫ్రికాలో ఏదో జరిగిపోతోందన్న ప్రచారం చేస్తున్నారని మండిపడుతోంది. Protesters have pulled down the fence at the Hluhluwe Game Reserve to let the animals out. Watch out for lions, etc. pic.twitter.com/uOQGTrQ4cA — The Duke (@TheDukeofOndini) July 11, 2021 Please note that the video currently circulating showing that Hluhluwe Park’s fence has been destroyed is an old video. It was taken on 12th May 2021 following the community protest by the community of Biliya community. So far we have not experienced any damage to our property. — EZEMVELO KZNWildlife (@EZEMVELOKZNWild) July 12, 2021 వారం దాటేసి.. దక్షిణాఫ్రికాకు తొమ్మిదేళ్లపాటు అధ్యక్షుడిగా పని చేశాడు జాకబ్ జుమా. అయితే పేదల పెన్నిధిగా పేరున్న జుమాపై సంచలనమైన ఆరోపణలు వచ్చాయి. 12 నేరాల జాబితాలో ఎట్టకేలకు కటకటాల వెనక్కి పంపగలిగింది రామఫోసా ప్రభుత్వం. దీంతో పెద్ద ఎత్తున్న వ్యతిరేక ఉద్యమం మొదలైంది. జనాలు భారీ ఎత్తున్న దొపిడీలకు పాల్పడుతుండడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే నిరసకారుల్ని, ప్రజల్ని అదుపు చేయడం పోలీస్ దళాలకు వల్ల కాలేదు. దీంతో జులై 12 నుంచి సైన్యం రంగంలోకి దిగింది. ఈ లోపు జుమా దాఖలు చేసిన రీ-పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ పరిణామంతో జుమాకు పట్టున్న ముఖ్యపట్టణాల్లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఇక ఇదంతా ప్రణాళికబద్ధంగా జరుగుతున్న దాడులేనని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రామఫోసా ఆరోపిస్తున్నారు. అల్లర్ల అదుపునకు మరో వారం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. -
ఉత్తరప్రదేశ్‌లో జన్మించి.. దక్షిణాఫ్రికాను అల్లకల్లోలం చేశారు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా(79)కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం 15 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జుమా అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తాయి. వారం క్రితం ప్రారంభమైన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఫలితంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70 మందికి పైగా మరణించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఈ నిరసన ప్రదర్శనలను 1990 తర్వాత దేశంలో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పారు. జుమాపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో ప్రధానంగా ముగ్గురు భారతీయ సోదరులు ఉన్నారు. వీరిని గుప్తా సోదరులుగా పిలుస్తారు. జుమాకు, ఈ సోదరులకు చాలా దగ్గర సంబంధం ఉందని.. అధ్యక్షుడు వీరికి దేశ వనరులను దోచి పెట్టాడని ఆరోపణలు వెలుగు చూశాయి. ఒకానొక సమయంలో గుప్తా బ్రదర్స్ జుమా ప్రభుత్వ పాలసీలను నిర్ణయించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఇక జుమా పదవి నుంచి దిగిపోయిన తర్వాత గుప్తా సోదరుల్లో ఇద్దరు దేశం విడిచి పారిపోయారు. జుమాపై ఉన్న కేసేంటి.. జుమాపై భారీ అవినీతి కేసులు నమోదయ్యాయి. దీనిలో ఒకటి 1999నాటి 2 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాల ఒప్పందం కేసు కాగా.. మరొకటి 2009-18 వరకు జుమా పరిపాలన కాలంలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలకు సంబంధించినది. మొదటి కేసులో జుమా ఆరోపణలను తోసిపుచ్చగా.. రెండో కేసులో విచారణకు అంగీకరించడం లేదని అధికారులు తెలిపారు. జుమాపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న పానెల్ జుమా, ముగ్గురు భారతీయ సోదరులతో కలిసి భారీ అవినీతికి పాల్పడినట్లు వెల్లడించింది. గుప్తా బ్రదర్స్‌గా పేరు గాంచిన అతుల్ గుప్తా, అజయ్ గుప్తా, రాజేస్ గుప్తాలతో కలిసి జుమా దేశ వనరులను కొల్లగొట్టారని తెలిపింది. గుప్తా సోదరులకు, జుమాకు మంచి సంబంధలుండేవని.. ఒకానొక దశలో జుమా ప్రభుత్వ పాలసీలను ఈ సోదరులే నిర్ణయించేవారని పానెల్ తెలిపింది. ఇక 2018లో జుమాను పదవి నుంచి తొలగించిన తర్వాత గుప్తా సోదరుల్లో ఇద్దరు దక్షిణాఫ్రికా విడిచి పారిపోయారు. జుమా-గుప్తా బంధం ‘జుప్తా’ జుమాకు, గుప్తా సోదరులకు తొలుత 2015-16 కాలంలో పరిచయం ఏర్పడింది. సహారా కంప్యూటర్ ఈవెంట్ సందర్భంగా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వత కొద్ది కాలంలోనే అది బలమైన బంధంగా మారింది. వీరి బంధాన్ని విమర్శకులు జుప్తా(జుమా+గుప్తా= జుప్తా)గా పిలిచేవారు. 2016లో గుప్తా సోదరులపై బలమైన అవినీతి ఆరోపణలు వెలుగు చూశాయి. గుప్తా బ్రదర్స్ అప్పటి ఉప ఆర్థిక మంత్రిని కలిసి.. తమ వ్యాపార ప్రయోజనాలను విస్తరించుకునే అవకాశం కల్పిస్తే.. అతడికి ఆర్థిక మంత్రి పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక సదరు మంత్రికి 600 మిలియన్ రాండ్లను చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక జుమా పదవి కోల్పోవడానికి గుప్తా బ్రదర్సే కారణమని మాజీ ఆర్థిక మంత్రి ప్రవీణ్ గోర్థాన్ ఆరోపించారు. ‘జుప్తా’ పతనం.. 2017లో దాదాపు లక్ష ఈ మెయిళ్లు లీక్ అయ్యాయి. ఇవన్ని ప్రధానంగా గుప్తా సోదరులకు సంబంధించినవే. జుమా ప్రభుత్వాన్ని గుప్తా బ్రదర్స్ ఎలా ప్రభావితం చేశారో ఈ ఈమెయిళ్లు తెలుపుతున్నాయి. దీనికి ముందు 2013లో గుప్తా సోదరులు చేసిన ఓ పని దక్షిణాఫ్రికా జనాల మనోభావాలను దెబ్బ తీసింది. అదేంటంటే దేశంలోని ముఖ్యులకు సంబంధించిన ఓ మిలటరీ ఎయిర్బేస్ని గుప్తా సోదరులు తమ వ్యక్తిగత పనులకు వాడుకోవడం తీవ్ర ఆగ్రహాన్ని రేకేత్తించింది. ఈ క్రమంలో ఈమెయిళ్లు లీక్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. జుమాకు, గుప్తా కుటుంబానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. 2018, ఫిబ్రవరిలో విపక్షాలు జుమాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దాంతో జుమా పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఆయనను బలవంతంగా అధ్యక్ష పదవి నుంచి దింపేసింది. గుప్తా సోదరులు దుబాయి, యూఏఈ పారిపోయారు. ఎవరీ గుప్తా సోదరులు.. గుప్తా సోదరులు పశ్చిమ ఉత్తరప్రదేశ్ సహరాన్‌పూర్‌కు చెందిన వారు. వీరికి ఓ చిన్న కుటుంబ వ్యాపారం ఉండేది. ఈ క్రమంలో వీరిలో పెద్దవాడైన అతుల్ గుప్తా 1993లో దక్షిణాఫ్రికా వెళ్లాడు. వర్ణవివక్ష ముగిసిన తర్వాత దేశం ప్రపంచానికి ఆహ్వానం పలికిన సమయంలో అతుల్ గుప్తా దక్షిణాఫ్రికా వెళ్లాడు. మిగతవారు ఆయనను అనుసరించారు. కొన్ని నివేదికల ప్రకారం గుప్తా సోదరులు మొదట్లో దక్షిణాఫ్రికాలో కార్లో బూట్లు తీసుకెళ్లి అమ్మేవారు. ఆ తర్వాత వారు సహారా కంప్యూటర్స్ అనే సంస్థను స్థాపించారు. వ్యాపారం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వారు రాజకీయ సంబంధాలను పెంచుకున్నారు.. వారు తమ వ్యాపారాన్ని కంప్యూటర్ల నుంచి విమాన ప్రయాణం, శక్తి, మైనింగ్, టెక్నాలజీ, మీడియా రంగాలకు విస్తరించారు. చివరకు దేశ పాలసీలను నిర్ణయించే వరకు ఎదిగారు. -
లొంగిపోయిన జాకబ్ జుమా
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా తాజాగా అధికారుల ఎదుట లొంగిపోయారు. అరెస్టు చేయడానికి న్యాయస్థానం విధించిన డెడ్‌లైన్‌కు కొన్ని నిమిషాల ముందు లొంగుబాటు ప్రక్రియ ముగిసింది. ఆయన 2009 నుంచి 2019 వరకూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు. పదవీ కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జాకబ్ జుమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు అందడంతో కేసులు నమోదయ్యాయి. విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని దక్షిణాఫ్రికా రాజ్యాంగ న్యాయస్థానం ఆదేశించగా, ఆయన అందుకు నిరాకరించారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద జుమాకు న్యాయమూర్తి 15 నెలల జైలు శిక్ష విధించారు. బుధవారం అర్ధరాత్రి లోగా లొంగిపోవాలని ఆదేశించారు. లేకపోతే అరెస్టు తప్పదని స్పష్టం చేశారు. దీంతో చేసేదిలేక జాకబ్ జుమా లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత పోలీసు అధికారులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని జుమా ఆరోపించారు. జుమాకు జైలు శిక్ష విధిస్తూ రాజ్యాంగ న్యాయస్థానం ఇచ్చిన తీర్పునుసవాలు చేస్తూ ఆయన తరపు న్యాయవాదులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. అయితే, హైకోర్టులో జుమాకు ఉశపమనం దక్కే అవకాశాలు తక్కువేనని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
కరోనాకాలంలో జైలు శిక్షంటే మరణ శిక్షతో సమానం!
జొహన్నెస్‌బర్గ్: పదవీ కాలంలో అవినీతి ఆరోపణలపై కోర్టు జైలు శిక్ష విధించడంతో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సానుభూతి పల్లవి అందుకున్నారు. ఇప్పటివరకు విచారణకు హాజరు కానంటూ బీరాలు పలికిన జూమా తాజాగా కొత్తపాట ఆరంభించారు. ఈ వయసులో, కరోనా సమయంలో తాను జైలుకు పోవడమంటే అది మరణ శిక్ష విధించినట్లేనంటూ సానుభూతిపరుల మద్దతుకు యత్నించారు. అంతలోనే తాను జైలుకు భయపడనంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు 1980 కాలం నాటి నిర్భంధాన్ని గుర్తు తెస్తున్నాయంటూ విమర్శించారు. మరోవైపు జుమా అరెస్టును అడ్డుకునేందుకు పలువురు మద్దతుదారులు ఆయన నివాసం చుట్టూ మానవ కవచంలా నిలుచున్నారు. అవినీతి కేసులో 15నెలల జైలు శిక్ష విధించిన కోర్టు ఆయనంతట ఆయనే పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తన ఇంటి బయట మద్దతుదారులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో 79ఏళ్ల వయసులో జైలుకు పోవడమంటే మరణశిక్ష విధించినట్లేనని, దక్షిణాఫ్రికాలో 1995లోనే మరణ శిక్ష రద్దయిందని చెప్పారు. ఇదే అభ్యర్ధన చేస్తూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానంలో తీర్పు పునఃసమీక్ష పిటీషన్ కూడా వేశారు. శనివారం ఈ పిటీషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించి, తదుపరి వాయిదాను జూలై 12కు వేసింది. అప్పటివరకు జైలు శిక్ష అమలు వాయిదా పడనుంది. కరోనా కాలంలో ఇంతమంది మద్దతుదారులు మాస్కుల్లేకుండా గుమికూడినా వారికి జుమా ఎలాంటి సూచనలు చేయలేదు. నిజానికి కరోనా నిబంధనల కాలంలో ఇలాంటి సమావేశం చట్టవ్యతిరేకమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే తమ నాయకుడిని అరెస్టు చేస్తే హింస తప్పదనే సంకేతాలను జుమా మద్దతుదారులిస్తున్నారు. జుమా, ఆయన మద్దతుదారుల ప్రవర్తనను పలువురు తీవ్రంగా ఖండించారు. -
జాకబ్ జుమాకు 15నెలల జైలు శిక్ష
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా(79)కు ఆదేశ అత్యున్నత న్యాయస్థానం 15నెలల జైలు శిక్షను విధించింది. జుమా పదవీ కాలంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జరుగుతన్న విచారణకు హాజరవ్వాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కారం కింద ఈ శిక్షను విధించింది. 2009–18 కాలంలో జుమా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. తాజాగా కోర్టు ధిక్కార శిక్ష విధింపు సమయంలో సైతం జూమా కోర్టులో లేరు. ఏదైనా పోలీసు స్టేషన్లో లొంగిపోయేందుకు ఆయనకు కోర్టు ఐదురోజుల సమయం ఇచ్చింది. ఈ సమయంలో లొంగుబాటుకు రాకుంటే అరెస్టుకు ఆదేశాలిస్తారు. -
ఎట్టకేలకు దిగొచ్చిన జుమా
జోహెన్నెస్ బర్గ్ : ఎట్టకేలకు దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి జాకోబ్ జుమా రాజీనామా చేశాడు. బుధవారం సాయంత్రం తన నిర్ణయాన్ని ఓ టెలివిజన్ సంస్థ ద్వారా ఆయన ప్రకటించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన జుమా.. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను కూలంకశంగా వివరించారు. ఆరోపణలు... అవినీతితో దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశాడని అధ్యక్షుడు జాకోబ్ జుమాపై ఆరోపణలు రుజువు అయ్యాయి. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం తదితర కారణాలు జుమాపై వ్యతిరేకత ఎక్కువ కావటానికి కారణాలు అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి దిగిపోవాలని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ) కోరింది. అయితే అందుకు ఆయన నిరాకరించటంతో సోమవారం ఏఎన్సీ అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించింది. వెంటనే ఆయన్ని రీకాల్ చేయాలని తీర్మానించింది. రాజీనామా చేయకపోతే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరింది. దీంతో దిగొచ్చిన జుమా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా తర్వాత కూడా జుమా 6 నెలలు కొనసాగాలని భావిస్తున్నట్లు ఏఎన్సీ ప్రధాన కార్యదర్శి మగషులే తొలుత పేర్కొన్నారు. అయితే అందుకు జుమా సుముఖత చూపకపోవటంతో డిప్యూటీ ప్రెసిడెంట్ సిరిల్ రామాఫోసా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించనున్నారు. మరోపక్క ప్రభుత్వాన్ని పార్లమెంట్‌ను రద్దుచేసి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
జాకబ్ జుమా రీకాల్‌కు ఏఎన్సీ నిర్ణయం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాను రీకాల్ చేయాలని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ) నిర్ణయించింది. అవినీతి ఆరోపణలతో నిండా మునిగిన జుమా రాజీనామాకు నిరాకరించటంతో సోమవారం ఏఎన్సీ అత్యున్నత స్థాయి భేటీ జరిపింది. దాదాపు 13 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత జుమాను సాగనంపాలని తీర్మానించింది. అయితే, ఇందుకు గడువేదీ విధించలేదు. ఈ మేరకు జుమాకు ఏఎన్సీ లేఖ రాయనున్నట్లు సమాచారం. రాజీనామాకు అంగీకరించిన జుమా 6 నెలలు కొనసాగాలని భావిస్తున్నట్లు ఏఎన్సీ ప్రధాన కార్యదర్శి మగషులే తెలిపారు. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం కారణాలతో జుమాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడటంతో పార్లమెంట్‌ను రద్దుచేసి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నెల్సన్ మండేలాపై వికృతమైన పెయింటింగ్
జోహన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాపై ఓ చిత్రకారుడు వేసిన అసభ్యకర పెయింటింగ్ పెను దుమారం రేపింది. ‘ దేశ ఆర్థిక వ్యవస్థ అత్యాచారానికి గురైంది’ అనే ఇతివృత్తంతో మండేలాతో దక్షిణాఫ్రికా ప్రస్తుత అధ్యక్షుడు జాకబ్ జూమా అసభ్యకర రీతిలో ఉన్నట్లుగా వివాదాస్పద చిత్రకారుడు అయందా మబులు పెయింటింగ్ వేశాడు. దీన్ని ‘వికృతమైన’దిగా దక్షిణాఫ్రికాలోని అధికార పార్టీ అభివర్ణించింది. ఆఫ్రికన్ జాతీయ కాంగ్రెస్ (ఏఎన్సీ), నెల్సన్ మండేలా ఫౌండేషన్ ఈ పెయింటింగ్ ఘటనను తీవ్రంగా ఖండించాయి. మబులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అయితే ఈ పెయింటింగ్ మాత్రం చాలా వికృతమైందని ఏఎన్సీ మండిపడింది. ప్రజలు ఈ పెయింటింగ్‌ను పట్టించుకోవద్దని సూచించింది. జాకబ్జూమాను అసభ్యంగా చిత్రీకరిస్తూ మబులు గతంలో కూడా అనేక వివాదాస్పద పెయింటింగ్‌లు వేశాడు. అయితే మండేలాపై వేసిన అసభ్యకర పెయింటింగ్‌ను మబులు సమర్థించుకున్నాడు. ఈ చిత్రం జుమా నాయకత్వంలోని దేశ పరిస్థితిని చూపించిందని వివరణ ఇచ్చుకున్నాడు. వివాదాస్పద చిత్రకారుడు అయందా మబులు -
అచ్చు ఇంటికి వచ్చినట్లే ఉంది: మోదీ
-
అచ్చు ఇంటికి వచ్చినట్లే ఉంది: మోదీ
దక్షిణాఫ్రికాకు వస్తే తనకు, తన బృందంలోని అధికారులకు అచ్చం ఇంటికి వచ్చినట్లుగానే ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకుగాను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు రెండూ వలస పాలన, జాతివివక్షలపై పోరాటంలో ఒకే దారిలో ఉన్నాయని ఆయన అన్నారు. నాలుగు రోజుల ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని.. అక్కడ అధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికార బృందంతో సమావేశమయ్యారు. అనంతరం అధ్యక్షుడు జాకబ్ జుమాతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలు చేసిన పోరాటం ఫలితంగా రెండు దేశాల మధ్య మంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందన్నారు. దక్షిణాఫ్రికాలో మైనింగ్, రసాయనాలు, ఔషధ పరిశ్రమలలో వ్యాపార, పెట్టుబడుల బంధాలను మరింత విస్తరించడానికి అవకాశం ఉందని తెలిపారు. తాను దక్షిణాఫ్రికా రావడం వల్ల ఇద్దరు మహానుభావులు.. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా నడిచిన భూమి మీద వారికి నివాళులు అర్పించే మహాభాగ్యం కలిగిందని మోదీ చెప్పారు. వృత్తివిద్యారంగంలో భారత దేశానికి ఉన్న సామర్థ్యం రెండు దేశాలకు ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ సమస్యలపై రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని జాకబ్ జుమా, తాను అంగీకారానికి వచ్చామన్నారు. ఇక ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం విషయంలో మద్దతు పలికినందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాఫ్రికా లాంటి మిత్రదేశాల అండ తమకు ఎంతో అవసరమన్నారు. ఇక రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోడానికి, విస్తరించుకోడానికి తమ ఇరు దేశాలు అంగీకరించినట్లు జాకబ్ జుమా చెప్పారు. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా జుమా ప్రమాణ స్వీకారం
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా జాకబ్ జుమా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ప్రిటోరియాలోని అధికార నివాసం యూనియన్ బిల్డింగ్స్ ఎదుట జరిగిన ఈ కార్యక్రమానికి వందలాదిమంది విదేశీ ప్రతినిధులు తరలివచ్చారు. దక్షిణాఫ్రికా చీఫ్ జస్టిస్ మొగోంగ్ జుమా చేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జుమా ఐదేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. -
దక్షిణాఫ్రికా ఎన్నికల్లో ఏఎన్సీ ఘనవిజయం
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఏఎన్సీ) ఘన విజయం సాధించింది. అయితే అవినీతి ఆరోపణలు, ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, నిరుద్యోగం వంటి అంశాల కారణంగా ఆ పార్టీ మెజారిటీ గతంతో పోలిస్తే ఈసారి కాస్త తగ్గింది.శుక్రవారం కడపటి వార్తలు అందేసరికి 99 శాతం ఫలితాలు వెలువడగా.. ఏఎన్సీ 62.2 శాతం ఓట్లు సాధించింది. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ 66 శాతం ఓట్లు సాధించగా.. ఈసారి ఆధిక్యం సుమారు 4 శాతం తగ్గింది. ఏఎన్సీ విజయంతో దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడిగా 72 ఏళ్ల జాకబ్ జుమా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు ప్రతిపక్ష డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి 22.2 శాతం ఓట్లు దక్కించుకుంది. దక్షిణాఫ్రికా మాజీ దేశాధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణానంతరం జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవే. -
నా భార్యను రేప్ చేశారు: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
సుమారు రూ.138 కోట్ల ప్రజాధనంతో తన ఫాంహౌస్‌ను ఆధునికీకరించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా మాత్రం ఈ చర్యను సమర్థించుకున్నారు. 1998లో తన ఇంట్లోకి కొందరు వ్యక్తులు చొరబడి తన భార్యపై అత్యాచారం చేశారని ఆయన తాజాగా వెల్లడించారు. తనకు భద్రత అవసరం లేదని వాదించే వారికి ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. ఆ ఘటనలో దోషులను ప్రభుత్వం అరెస్టు చేసి శిక్షించిందన్నారు. అయితే వాస్తవానికి జాకబ్ జుమాకు నలుగురు భార్యలున్నారు. ఆ నలుగురిలో ఎవరిపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. జాకబ్ జుమా 2009లో దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడయ్యారు. -
నా భార్యను రేప్ చేశారు:దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
జొహాన్నెస్‌బర్గ్: సుమారు రూ. 138 కోట్ల ప్రజాధనంతో తన ఫాంహౌస్‌ను ఆధునీకరించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా మాత్రం ఈ చర్యను సమర్థించుకున్నారు. 1998లో తన ఇంట్లోకి కొందరు వ్యక్తులు చొరబడి తన భార్యపై అత్యాచారం చేశారని సోమవారం చెప్పుకొచ్చారు. తనకు భద్రత అవసరం లేదని వాదించే వారికి ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. ఆ ఘటనలో దోషులను ప్రభుత్వం అరెస్టు చేసి శిక్షించిందన్నారు. జుమాకు నలుగురు భార్యలు ఉన్నా ఎవరిపై అత్యాచారం జరిగిందో ఆయన చెప్పలేదు. జుమా 2009లో దేశాధ్యక్షుడయ్యారు. -
15న మండేలా అంత్యక్రియలు... హాజరుకానున్న ఒబామా
దక్షిణాఫ్రికా జాతిపిత, నల్లజాతి సూర్యడు నెల్సన్ మండేలా అంత్యక్రియలు ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు జాకోబ్ జూమా ఇక్కడ వెల్లడించారు. ఈస్టరన్ కేప్‌లోని క్యూనులో మండేలా స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం ఆయన జోహెన్స్‌బర్గ్‌లోని మండేలా కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మండేలా అంత్యక్రియలు వచ్చే ఆదివారం నిర్వహించాలని తెలిపారని ఆయన చెప్పారు. ఆ మహానియుడి మృతికి 10 రోజులు సంతాపదినాలుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మండేలా ఆత్మశాంతికి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండేలా మృతితో ఆయన కుటుంబానికి దక్షిణాఫ్రికా వాసులతోపాటు ప్రపంచ ప్రజలు మద్దతుగా నిలవడం పట్ల జూమా సంతోషం వ్యక్తం చేశారు. వారందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నెల్సన్ మండేలా అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ప్రపంచనేతలు హాజరుకానున్నారు. గత కొన్ని ఏళ్లుగా నెల్సన్ మండేలా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మధ్యలో మండేలా తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన కోలుకుని, సెప్టెంబర్1న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జోహెన్స్‌బర్గ్‌లో స్వగృహంలో మండేలా గురువారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
మండేలా ఇక లేరు
-
నెల్సన్ మండేలా కన్నుమూత
-
నెల్సన్ మండేలా కన్నుమూత
జోహన్నస్బర్గ్: తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన నల్లసూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(95) కన్నుమూశారు. జోహన్నస్బర్గ్లోని స్వగృహంలో గురువారం రాత్రి 8.50 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఆయన తుదిశ్వాస విడిచారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు. దేశం గొప్ప నాయకున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. దేశ ప్రజలు జాతిపితను పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అధికార లాంఛనాలతో మండేలా అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయాలని జుమా ఆదేశించారని బీబీసీ తెలిపింది. భారత జాతి పిత మహాత్మ గాంధీ బోధించిన అహింస, శాంతియుత విధానాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తరచు చెప్పే మండేలా ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నారు. కేప్ ప్రాంతంలోని తెంబు వంశానికి చెందిన కుటుంబంలో ఆయన 1918 జూలై 18న జన్మించారు. విద్యార్ధిదశలోనే వర్ణవివక్ష వ్యతిరేక పోరాటాలకు ఆకర్షితుడై తన జాతి విముక్తి కోసం అంకితమయ్యాడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, రాబెన్ దీవిలో 27 సంవత్సరాల సుదీర్ఘ కారాగార వాసం అనుభవించిన తర్వాత, ఆ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి సహా పలు అవార్డులు, రివార్డులు పొందారు. భారత ప్రభుత్వం కూడా ఆయనను నెహ్రూ శాంతి బహుమతితో సత్కరించింది. నెల్సన్ మండేలాకు ఆరుగురు సంతానం. ఆయన మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. మండేలా మొదటి వివాహం దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారు ఎక్కువగా నివసించే ట్రాన్స్కీ అనే ప్రదేశం నుంచి వచ్చిన ఎంటోకో మేస్ అనే మహిళతో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. వీరు వివాహమైన 13 సంవత్సరాల తరువాత 1957లో అభిప్రాయ భేదాలతో విడిపోయారు. మండేలా రెండవ భార్య విన్నీ మడికిజెలా మండేలా. వీరికి ఇద్దరు కుమార్తెలు. 1992లో వారు విడాకులు తీసుకొన్నారు. 1998లో తన 80వ జన్మదినం సందర్భంగా నెల్సన్ మండేలా మూడవసారి గ్రాచా మాచెల్‌ను పెళ్లి చేసుకొన్నారు. నెల్సన్ మండేలా మరణం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు. మండేలా నుంచి స్ఫూర్తి పొందిన వారిలో తాను ఒకడినని తెలిపారు. మండేలా లాంటి నాయకున్ని ప్రపంచం మళ్లీ చూడబోదని సంతాప సందేశంలో ఒబామా పేర్కొన్నారు.