నా భార్యను రేప్ చేశారు: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు | My wife was raped once, says South African President | Sakshi
Sakshi News home page

నా భార్యను రేప్ చేశారు: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

Published Tue, May 6 2014 11:36 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

నా భార్యను రేప్ చేశారు: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు - Sakshi

నా భార్యను రేప్ చేశారు: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

సుమారు రూ.138 కోట్ల ప్రజాధనంతో తన ఫాంహౌస్‌ను ఆధునికీకరించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా మాత్రం ఈ చర్యను సమర్థించుకున్నారు. 1998లో తన ఇంట్లోకి కొందరు వ్యక్తులు చొరబడి తన భార్యపై అత్యాచారం చేశారని ఆయన తాజాగా వెల్లడించారు. తనకు భద్రత అవసరం లేదని వాదించే వారికి ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. ఆ ఘటనలో దోషులను ప్రభుత్వం అరెస్టు చేసి శిక్షించిందన్నారు.

అయితే వాస్తవానికి జాకబ్ జుమాకు నలుగురు భార్యలున్నారు. ఆ నలుగురిలో ఎవరిపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. జాకబ్ జుమా 2009లో దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement