తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన నల్లసూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(95) కన్నుమూశారు. జోహన్నస్బర్గ్లోని స్వగృహంలో గురువారం రాత్రి 8.50 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఆయన తుదిశ్వాస విడిచారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు.