జొహాన్నెస్‌బర్గ్: సుమారు రూ. 138 కోట్ల ప్రజాధనంతో తన ఫాంహౌస్‌ను ఆధునీకరించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా మాత్రం ఈ చర్యను సమర్థించుకున్నారు. 1998లో తన ఇంట్లోకి కొందరు వ్యక్తులు చొరబడి తన భార్యపై అత్యాచారం చేశారని సోమవారం చెప్పుకొచ్చారు. తనకు భద్రత అవసరం లేదని వాదించే వారికి ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు.
ఆ ఘటనలో దోషులను ప్రభుత్వం అరెస్టు చేసి శిక్షించిందన్నారు. జుమాకు నలుగురు భార్యలు ఉన్నా ఎవరిపై అత్యాచారం జరిగిందో ఆయన చెప్పలేదు. జుమా 2009లో దేశాధ్యక్షుడయ్యారు.