south africa president
-
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ)కు చెందిన సిరిల్ రామఫోసా(71) మళ్లీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్సీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది. దీంతో, డెమోక్రాటిక్ అలయెన్స్, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏఎన్సీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. శుక్రవారం పార్లమెంట్లో జరిగిన ఎన్నిక లో రామఫోసాకు 283 ఓట్లు పడగా, ప్రత్యర్థి మలేమాకు 44 ఓట్లే ద క్కాయి. రామఫోసా బుధవారం అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా(69) కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు స్వల్పలక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. సోమవారం కేప్‌టౌన్‌లో జరిగిన మాజీ ఉపాధ్యక్షుడు డీక్లార్క్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రమఫోసా అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను రక్షణ శాఖ ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. రమఫోసా కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు. సోమవారం 37,875 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న రమఫోసా..ఉపాధ్యక్షుడు డేవిడ్ మబూజాకు వారం పాటు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని మంత్రి ఒకరు తెలిపారు. రమఫోసా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడిన విషయం తెలిసిందే. -
గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసను ప్రత్యేక అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా లేదా దక్షిణ అమెరికా ఖండాల్లోని ఏదైనా ఒక దేశాధినేతను గణతంత్ర వేడుకలకు అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించాలనుకుంటోందనీ, రమఫోస పేరు దాదాపుగా ఖరారైనప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంబంధిత ఉన్నతాధికారులు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించినా ఆయన రాలేనని చెప్పడం తెలిసిందే. -
నా భార్యను రేప్ చేశారు:దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
జొహాన్నెస్‌బర్గ్: సుమారు రూ. 138 కోట్ల ప్రజాధనంతో తన ఫాంహౌస్‌ను ఆధునీకరించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా మాత్రం ఈ చర్యను సమర్థించుకున్నారు. 1998లో తన ఇంట్లోకి కొందరు వ్యక్తులు చొరబడి తన భార్యపై అత్యాచారం చేశారని సోమవారం చెప్పుకొచ్చారు. తనకు భద్రత అవసరం లేదని వాదించే వారికి ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. ఆ ఘటనలో దోషులను ప్రభుత్వం అరెస్టు చేసి శిక్షించిందన్నారు. జుమాకు నలుగురు భార్యలు ఉన్నా ఎవరిపై అత్యాచారం జరిగిందో ఆయన చెప్పలేదు. జుమా 2009లో దేశాధ్యక్షుడయ్యారు.