నెల్సన్ మండేలాపై వికృతమైన పెయింటింగ్
జోహన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాపై ఓ చిత్రకారుడు వేసిన అసభ్యకర పెయింటింగ్ పెను దుమారం రేపింది. ‘ దేశ ఆర్థిక వ్యవస్థ అత్యాచారానికి గురైంది’ అనే ఇతివృత్తంతో మండేలాతో దక్షిణాఫ్రికా ప్రస్తుత అధ్యక్షుడు జాకబ్ జూమా అసభ్యకర రీతిలో ఉన్నట్లుగా వివాదాస్పద చిత్రకారుడు అయందా మబులు పెయింటింగ్ వేశాడు. దీన్ని ‘వికృతమైన’దిగా దక్షిణాఫ్రికాలోని అధికార పార్టీ అభివర్ణించింది. ఆఫ్రికన్ జాతీయ కాంగ్రెస్ (ఏఎన్‌సీ), నెల్సన్ మండేలా ఫౌండేషన్ ఈ పెయింటింగ్ ఘటనను తీవ్రంగా ఖండించాయి.
మబులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అయితే ఈ పెయింటింగ్ మాత్రం చాలా వికృతమైందని ఏఎన్‌సీ మండిపడింది. ప్రజలు ఈ పెయింటింగ్‌ను పట్టించుకోవద్దని సూచించింది. జాకబ్‌జూమాను అసభ్యంగా చిత్రీకరిస్తూ మబులు గతంలో కూడా అనేక వివాదాస్పద పెయింటింగ్‌లు వేశాడు. అయితే మండేలాపై వేసిన అసభ్యకర పెయింటింగ్‌ను మబులు సమర్థించుకున్నాడు. ఈ చిత్రం జుమా నాయకత్వంలోని దేశ పరిస్థితిని చూపించిందని వివరణ ఇచ్చుకున్నాడు.
వివాదాస్పద చిత్రకారుడు అయందా మబులు