రూ.20.95 లక్షల బైక్‌కు రీకాల్ - కారణం ఇదే.. | BMW R 1300 GS Recalled Over Faulty Starter Relay, More Details Inside | Sakshi
Sakshi News home page

రూ.20.95 లక్షల బైక్‌కు రీకాల్ - కారణం ఇదే..

Published Tue, Jul 30 2024 5:04 PM | Last Updated on Tue, Jul 30 2024 5:45 PM

BMW R 1300 GS Recalled Details

బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇటీవలే దేశీయ మార్కెట్లో రూ. 20.95 లక్షల (ఎక్స్ షోరూమ్) ఆర్ 1300 జీఎస్ బైక్ లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ బైకులకు రీకాల్ ప్రకటించింది.

బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైకులో రిలే సరిగా పనిచేయడం లేదనే సమస్య కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య బైక్ నిలిచిపోవడానికి కారణమవుతుంది. 18 మార్చి 2024కి ముందు తయారు చేసిన బైకులలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. కాబట్టి వీటికి రీకాల్ ప్రకటించింది.

రీకాల్ ప్రకటించిన బైకులలో సమస్యను పరిష్కారించడానికి కంపెనీ కొత్త ఎలక్ట్రోమెకానికల్ స్టార్టర్ రిలేను అమర్చనుంది. కంపెనీ 2024 మార్చి 18 ముందు సుమారు 25000 బైకులను తయారు చేసినట్లు.. వీటన్నంటికీ సంస్థ రీకాల్ ప్రకటించింది.

ఇప్పటి వరకు బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ కంపెనీ ముందుగానే స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా ఈ బైకులలోని సమస్యను సంస్థ ఉచితంగా పరిష్కరించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement