
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 9,125 కార్లను రీకాల్ చేస్తోంది. మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడు పోతున్న సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6, గ్రాండ్ వితారా కార్లలో ముందు వరుస సీట్ల బెల్ట్‌లలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇవి 2022 నవంబర్ 2–28 తేదీల్లో తయారైనవని కంపెనీ తెలిపింది.
షోల్డర్ హైట్ అడ్జెస్టర్ ఉప భాగాలలో ఒకదానిలో లోపం ఉందని అనుమానిస్తున్నామని, ఇది అరుదైన సందర్భంలో సీట్ బెల్ట్ విడదీయడానికి దారితీయవచ్చని మారుతీ సుజుకీ వెల్లడించింది.
వాహనాలను తనిఖీ చేసి, లోపం ఉన్న భాగాన్ని భర్తీ చేయడం కోసం ఉచితంగా రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ వివరించింది. అధీకృత వర్క్‌షాప్‌ల నుండి సంబంధిత కార్ల యజమానులకు సమాచారం వెళుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment