హార్లీ-డేవిడ్‌సన్‌ బైక్‌లు వెనక్కి | Harley-Davidson recalls 251,000 motorcycles worldwide | Sakshi
Sakshi News home page

బైక్‌లను వెనక్కి తీసుకుంటున్న హార్లీ-డేవిడ్‌సన్‌

Published Thu, Feb 8 2018 10:31 AM | Last Updated on Thu, Feb 8 2018 1:16 PM

Harley-Davidson recalls 251,000 motorcycles worldwide - Sakshi

హార్లీ-డేవిడ్‌సన్‌ బైకుల రీకాల్‌

చికాగో : అమెరికన్‌ మోటార్‌సైకిల్‌ దిగ్గజం హార్లీ-డేవిడ్‌సన్‌ భారీ మొత్తంలో బైక్‌లను వెనక్కి తీసుకుంది. బ్రేక్‌ ఫెయిల్యూర్‌ కారణంతో ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలకు పైగా మోటార్‌సైకిళ్లను స్వచ్ఛదంగా వెనక్కి తీసుకున్నట్టు హార్లీ-డేవిడ్‌సన్‌ ప్రకటించింది. యాంటీ-లాక్‌ బ్రేక్స్‌తో సీవీఓ టూరింగ్‌, వీఎస్‌ఆర్‌సీ బైక్‌లతో ఇవి రూపొందాయి. 2008 నుంచి 2011 మధ్యలోని మోడల్స్‌ను హార్లీ-డేవిడ్‌సన్‌ వెనక్కి తీసుకున్నట్టు జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ రిపోర్టు చేసింది. 

ఈ రీకాల్‌ ఖర్చు 29.4 మిలియన్‌ డాలర్లు(రూ.189 కోట్లకు పైగా)గా కంపెనీ తెలిసింది. బైక్‌ ఫెయిల్యూర్‌కు ప్రభావితమైన మోటార్స్‌ సైకిళ్లలో లక్షా 75వేలు అమెరికాలోనే విక్రయించారు. యాంటీ-లాక్‌ బ్రేక్‌ సిస్టమ్‌లో సమస్య ఉందని, ఎలాంటి వార్నింగ్‌ లేకుండా బ్రేక్‌ ఫెయిల్‌ అయిపోతుందని తెలిసింది. 43 ఫిర్యాదులు అనంతరం అమెరికా నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ ఈ సమస్యను 2016 జూలై నుంచి విచారించడం ప్రారంభించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement