4 బ్యాచ్ ల కాంబిఫ్లామ్ ఔషధం రీకాల్ | Sanofi recalls batches of painkiller 'Combiflam' in India | Sakshi
Sakshi News home page

4 బ్యాచ్ ల కాంబిఫ్లామ్ ఔషధం రీకాల్

Published Fri, May 13 2016 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

4 బ్యాచ్ ల కాంబిఫ్లామ్ ఔషధం రీకాల్

4 బ్యాచ్ ల కాంబిఫ్లామ్ ఔషధం రీకాల్

ఇప్పటికే 2 బ్యాచ్‌ల ఔషధాలు వెనక్కి
న్యూఢిల్లీ: సనోఫి ఇండియా కంపెనీ కాంబిఫ్లామ్ బ్రాండ్ పెయిన్‌కిల్లర్‌కి సంబంధించిన నాలుగు బ్యాచ్‌ల ఔషధాలను రీకాల్ చేస్తోంది. ప్రమాణాలకనుగుణంగా  ఈ నాలుగు బ్యాచ్‌ల కాంబిఫ్లామ్ ఔషధాలు లేవని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) పేర్కొనడంతో వీటిని రీకాల్ చేస్తున్నామని సనోఫి కంపెనీ పేర్కొంది. ఈ ఔషధం డిస్‌ఇంటిగ్రేషన్ టైమ్(శరీరంలో విచ్ఛిన్నమయ్యే సమయం) ఎక్కువగా ఉందని సీడీఎస్‌సీఓ పరీక్షల్లో తేలిందని సనోఫి ప్రతినిధి తెలిపారు.

డిస్‌ఇంటిగ్రేషన్ టైమ్ అధికంగా ఉన్నప్పటికీ, ఈ ఔషధం రక్షణ, సామర్థ్యానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన భరోసానిచ్చారు. అయినప్పటికీ, ప్రమాణాలకనుగుణంగా ఈ బ్యాచ్‌ల ఔషధాల్లేవని సీడీఎస్‌సీఓ పేర్కొనడంతో వీటిని రీకాల్ చేస్తున్నామని, ఇప్పటికే రెండు బ్యాచ్‌ల ఔషధాలను వెనక్కి తీసుకున్నామని వివరించారు. కాగా ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో సనోఫి ఇండియా షేర్ స్వల్పంగా లాభపడి రూ.4,330 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement