Sanofi India Company
-
Corona Vaccine: సనోఫీ–జీఎస్కే వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్
న్యూఢిల్లీ: సనోఫీ పాయిశ్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్–జీఎస్కే ఫార్మాస్యూటికల్ కంపెనీ సంయుక్తంగా కొవిడ్–19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది ప్రోటీన్ ఆధారితం. తాజాగా ఈ టీకా మూడో దశ ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి మంజూరు చేసింది. ఈ దశలో టీకా భద్రత, సమర్థత, కరోనా వైరస్‌పై పనితీరును క్షుణ్నంగా పరీక్షించనున్నారు. భారత్‌తోపాటు అమెరికా, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో 35,000కు పైగా వలంటీర్లపై తమ టీకా ప్రయోగాలు నిర్వహించనున్నట్లు సనోఫీ సంస్థ కంట్రీ హెడ్ అన్నపూర్ణ దాస్ చెప్పారు. ఇందుకోసం 18 ఏళ్లు పైబడిన వలంటీర్లను నియమించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక టీకా అభివృద్ధి విషయంలో మూడో దశ ట్రయల్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. కరోనా వైరస్‌లో మార్పులు కొనసాగుతున్నాయని, కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించామని తెలిపారు. -
4 బ్యాచ్ ల కాంబిఫ్లామ్ ఔషధం రీకాల్
ఇప్పటికే 2 బ్యాచ్‌ల ఔషధాలు వెనక్కి న్యూఢిల్లీ: సనోఫి ఇండియా కంపెనీ కాంబిఫ్లామ్ బ్రాండ్ పెయిన్కిల్లర్కి సంబంధించిన నాలుగు బ్యాచ్‌ల ఔషధాలను రీకాల్ చేస్తోంది. ప్రమాణాలకనుగుణంగా ఈ నాలుగు బ్యాచ్‌ల కాంబిఫ్లామ్ ఔషధాలు లేవని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) పేర్కొనడంతో వీటిని రీకాల్ చేస్తున్నామని సనోఫి కంపెనీ పేర్కొంది. ఈ ఔషధం డిస్‌ఇంటిగ్రేషన్ టైమ్(శరీరంలో విచ్ఛిన్నమయ్యే సమయం) ఎక్కువగా ఉందని సీడీఎస్సీఓ పరీక్షల్లో తేలిందని సనోఫి ప్రతినిధి తెలిపారు. డిస్‌ఇంటిగ్రేషన్ టైమ్ అధికంగా ఉన్నప్పటికీ, ఈ ఔషధం రక్షణ, సామర్థ్యానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన భరోసానిచ్చారు. అయినప్పటికీ, ప్రమాణాలకనుగుణంగా ఈ బ్యాచ్‌ల ఔషధాల్లేవని సీడీఎస్సీఓ పేర్కొనడంతో వీటిని రీకాల్ చేస్తున్నామని, ఇప్పటికే రెండు బ్యాచ్‌ల ఔషధాలను వెనక్కి తీసుకున్నామని వివరించారు. కాగా ఈ నేపథ్యంలో బీఎస్ఈలో సనోఫి ఇండియా షేర్ స్వల్పంగా లాభపడి రూ.4,330 వద్ద ముగిసింది.