అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఏకంగా 1,25,000 కంటే ఎక్కువ కార్లకు రీకాల్ ప్రకటించింది. సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో లోపాలు ఉన్నట్లు గుర్తించి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
రీకాల్ ప్రకటించిన కార్లలో 2012 - 2024 మధ్య తయారైన టెస్లా ఎస్ మోడల్, 2015 - 2024 మధ్య విడుదలైన ఎక్స్ మోడల్, 2017-2023 మోడల్ 3, 2020-2023 మోడల్ Y వాహనాలు ఉన్నాయి. సీట్ బెల్ట్ ధరించని డ్రైవర్లకు రిమైండర్ సిగ్నెల్ అందించాలి, కానీ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా ఇది సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించారు. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.
సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్‌లో ఏర్పడిన లోపాన్ని సరిచేయడానికి టెస్లా ఈ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీ కార్లలో ఈ సమస్య ఉన్నట్లు ఎక్కడా ఫిర్యాదులు అందలేదు. కానీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ సమస్యను గురించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment