మాకార్లు ఇప్పుడే వాడితే ప్రమాదం.. జాగ్రత్త | tesla recalls its own cars | Sakshi
Sakshi News home page

మాకార్లు ఇప్పుడే వాడితే ప్రమాదం.. జాగ్రత్త

Published Wed, Apr 13 2016 2:58 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

tesla recalls its own cars

మూడు వరుసల సీట్లు ఉండే టెస్లా మోడల్‌ ఎక్స్‌ ఎస్‌యూవీ, 2,700 కార్లను ఆ కంపెనీ ఉపసంహరించుకుంది. లైటింగ్‌ వ్యవస్థలో సమస్యలు ఉత్పన్నమవడం, సీట్ల అమరిక కూడా లోపభూయిష్టంగా ఉండి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండటంతో తిరిగి వాటిని పునరుద్ధరించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మార్కెట్లో కార్లను ఉపసంహరించుకుంటోంది.

లోపాలను సరిచేశాక మళ్లీ వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, మార్చి 26కు ముందు తయారుచేసిన కార్లనే కంపెనీ రీకాల్‌ చేస్తోంది. కార్లను కొనుగోలు చేసిన వినియోగదారులు స్థానిక సర్వీసు సెంటర్లను ఆశ్రయించి సీట్‌ బ్యాక్‌లను మార్పించుకోవాలని కంపెనీ సూచించింది. టెస్లా సర్వీస్‌ సెంటర్లో ఈ సమస్యలను సరిచేసేంత వరకూ వినియోగదారులు ఈ కార్లను వాడొద్దని తెలిపింది. కాగా, కంపెనీ ఈ మోడల్‌ కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టేముందే చాలాసార్లు జాప్యం చేసింది. ఆఖరికి 2015 సెప్టెంబర్‌లో ఈ మోడల్‌ను విడుదల చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement