![Thousands of Tesla Cybertrucks Recalled](/styles/webp/s3/article_images/2024/06/30/cyber-truck-recall.jpg.webp?itok=J-Sl3hQh)
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులకు ముందు అమరికలో సైబర్‌ట్రక్ లాంచ్ చేసింది. లాంచ్ చేసిన కొన్ని రోజుల తరువాత కంపెనీ సుమారు 11,688 సైబర్ ట్రక్కులకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ ఈ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి? దీనికోసం కంపెనీ చార్జెస్ వసూలు చేస్తుందా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టెస్లా కంపెనీ లాంచ్ చేసిన ఈ సైబర్ ట్రక్కులను రీకాల్ చేయడానికి ప్రధాన కారణం.. విండ్‌షీల్డ్ వైపర్ పనిచేయకపోవడం, ట్రంక్ బెడ్ ట్రిమ్ సమస్య అని తెలుస్తోంది. ఈ రెండు సమస్యల కారణంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) వెల్లడించింది.
ఏజెన్సీ ప్రకారం.. కొన్ని సందర్భాల్లో విండ్‌షీల్డ్ వైపర్ ఎటువంటి హెచ్చరిక లేకుండా విఫలమవుతుంది. ఇది వర్షం పడుతున్నప్పుడు సమయంలో ప్రమాదానికి కారణం అవ్వొచ్చని తెలుస్తోంది. 2023 నవంబర్ 13 నుంచి జూన్ 6 మధ్య తయారైన వాహనాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కస్టమర్లకు ఆగష్టు 18న మెయిల్ ద్వారా మెయిల్ అందుతుంది. ఈ రీకాల్ కోసం కంపెనీ ఎటువంటి చార్జీలు వసూలు చేయదు.
ఇప్పటి వరకు సైబర్ ట్రక్కుల వినియోగదారుల నుంచి దీనికి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అయితే భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చని.. కంపెనీ స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. దీనిని సైబర్‌ట్రక్ వినియోగదారులు సులభంగా ఎటువంటి చార్జీలు చెల్లించకుండా వినియోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment