ప్రముఖ ఔషధాల తయారీదారు 'అబాట్ ఇండియా' (Abbott India) తన గోవా ఫెసిలిటీలో తయారు చేసిన యాంటాసిడ్ సిరప్ 'డైజీన్ జెల్'కి సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణం ఏంటి? దీని వినియోగం వల్ల వచ్చే ప్రమాదమేంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పింక్ కలర్‌లో ఉన్న ఈ మెడిసిన్‌ని వినియోగదారులు ఆగస్టు ప్రారంభంలో కొనుగోలు చేసినప్పుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా, ఘాటైన వాసన కలిగి ఉన్నట్లు తెలిసింది. దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అబాట్ యాంటాసిడ్ డైజీన్ జెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది.
భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటాసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరింది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని, దీని వల్ల రోగి ప్రతికూల ప్రభావాణ్ణి ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది.
ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్‌పీరియన్స్!
నిజానికి డైజీన్ సిరప్ లేదా మాత్రలు అసిడిటీ, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు నొప్పి, గ్యాస్ వంటి వాటిని నివారించడంలో ఉపయోగిస్తారు. అయితే ఈ సమస్యల కోసం ఈ ఔషధం ఉపయోగించే వారు వెంటనే నిలిపివేయాలి. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ ప్రొడక్ట్‌కి రీకాల్ ప్రకటించింది.
డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా దీనిని ఎవరైనా విక్రయిస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఔషధం వినియోగించిన వ్యక్తికి ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే దాని గురించి తెలియజేయాలని DCGI ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment