acidity capsules
-
'డైజీన్ సిరప్' వాడుతున్నారా? వెంటనే ఆపేయండి! లేదంటే..
ప్రముఖ ఔషధాల తయారీదారు 'అబాట్ ఇండియా' (Abbott India) తన గోవా ఫెసిలిటీలో తయారు చేసిన యాంటాసిడ్ సిరప్ 'డైజీన్ జెల్'కి సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణం ఏంటి? దీని వినియోగం వల్ల వచ్చే ప్రమాదమేంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పింక్ కలర్లో ఉన్న ఈ మెడిసిన్‌ని వినియోగదారులు ఆగస్టు ప్రారంభంలో కొనుగోలు చేసినప్పుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా, ఘాటైన వాసన కలిగి ఉన్నట్లు తెలిసింది. దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అబాట్ యాంటాసిడ్ డైజీన్ జెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటాసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరింది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని, దీని వల్ల రోగి ప్రతికూల ప్రభావాణ్ణి ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది. ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్! నిజానికి డైజీన్ సిరప్ లేదా మాత్రలు అసిడిటీ, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు నొప్పి, గ్యాస్ వంటి వాటిని నివారించడంలో ఉపయోగిస్తారు. అయితే ఈ సమస్యల కోసం ఈ ఔషధం ఉపయోగించే వారు వెంటనే నిలిపివేయాలి. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ ప్రొడక్ట్‌కి రీకాల్ ప్రకటించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా దీనిని ఎవరైనా విక్రయిస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఔషధం వినియోగించిన వ్యక్తికి ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే దాని గురించి తెలియజేయాలని DCGI ఆదేశించింది. -
అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడితే ఏమవుతుందో తెలుసా?
అజీర్ణం, త్రేన్పులు, ఛాతీలో మంట వంటి వాటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్ వంటి మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని దీర్ఘకాలం వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్ఠత తగ్గి.. తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హమీద్ ఖలీల్ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరిశీలించింది. ఈ అధ్యయనంలో.. పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35 శాతం పెరిగినట్టు గుర్తించారు. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. అందువల్ల అసిడిటీ మందులు మోతాదు మించి వాడకుండా ఉండటం మంచిది. -
ఎసిడిటీ మందులతో కేన్సర్ ముప్పు రెట్టింపు
ఎసిడిటీ మందులు ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. వీటిని ఎక్కువ కాలం పాటు తీసుకోవడం వల్ల కడుపులో కేన్సర్ వచ్చే అవకాశాలు రెట్టింపవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కారణంగా ఎసిడిటీ ఏర్పడుతుందని తెలిసిన విషయమే. దీనికీ కడుపులో కేన్సర్‌కు సంబంధం ఉన్నట్లు గతంలోనే పరిశోధనలు స్పష్టం చేశాయి. అయితే ఈ బ్యాక్టీరియా నిర్మూలన చికిత్స తీసుకున్నాక కూడా కొందరిలో కడుపు కేన్సర్ రావడం శాస్త్రవేత్తల్లో సందేహం రేకెత్తించింది. దీంతో 2003–2012 మధ్యలో ఈ చికిత్స తీసుకున్న దాదాపు 63 వేల మంది వివరాలు పరిశీలించారు. వీరిలో కొందరు ఎసిడిటీ నివారణకు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్ మందులు వాడగా, ఇంకొందరు హెచ్2 బ్లాకర్ మందులు వాడారు. వీరిలో కొంతమంది కడుపు కేన్సర్‌తో మరణించారు. వీరిలో మూడేళ్ల పాటు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్లు వాడిన దాదాపు 153 మంది ఉండగా.. హెచ్ 2 బ్లాకర్లు తీసుకున్న వారిలో ఎలాంటి లక్షణాలు కన్పించలేదు. అలాగే వారానికో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్ మాత్ర తీసుకునే వారితో పోలిస్తే రోజూ వేసుకునే వారికి కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. -
అమెరికాలో తిరిగి డాక్టర్ రెడ్డీస్ ఎసిడిటీ క్యాప్సుల్స్
ముంబై: ఎసిడిటీని నివారించే జెనరిక్ వెర్షన్ ఎసోమెప్రజాల్ క్యాప్యుల్స్‌ను డాక్టర్ రెడ్డిస్ తిరిగి అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. స్థానిక కోర్టు ఈ జెనరిక్ వెర్షన్ అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయమని ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ క్యాప్యుల్స్ రంగును మార్చి తిరిగి విడుదల చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రాజెనికాకు చెందిన నెక్సియమ్ క్యాప్యుల్స్కి ఇది జెనరిక్ వెర్షన్. డాక్టర్ రెడ్డీస్ జెనరిక్ వెర్షన్‌ను ఒరిజినల్ క్యాప్యుల్స్లాగా ఉదారంగులోనే విడుదల చేయడంపై ఆస్ట్రాజెనికా కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే.