అజీర్ణం, త్రేన్పులు, ఛాతీలో మంట వంటి వాటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్ వంటి మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని దీర్ఘకాలం వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్ఠత తగ్గి.. తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.
బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హమీద్ ఖలీల్ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరిశీలించింది. ఈ అధ్యయనంలో.. పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35 శాతం పెరిగినట్టు గుర్తించారు. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. అందువల్ల అసిడిటీ మందులు మోతాదు మించి వాడకుండా ఉండటం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment