ఎసిడిటీ మందులు ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. వీటిని ఎక్కువ కాలం పాటు తీసుకోవడం వల్ల కడుపులో కేన్సర్ వచ్చే అవకాశాలు రెట్టింపవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కారణంగా ఎసిడిటీ ఏర్పడుతుందని తెలిసిన విషయమే. దీనికీ కడుపులో కేన్సర్‌కు సంబంధం ఉన్నట్లు గతంలోనే పరిశోధనలు స్పష్టం చేశాయి. అయితే ఈ బ్యాక్టీరియా నిర్మూలన చికిత్స తీసుకున్నాక కూడా కొందరిలో కడుపు కేన్సర్ రావడం శాస్త్రవేత్తల్లో సందేహం రేకెత్తించింది.
దీంతో 2003–2012 మధ్యలో ఈ చికిత్స తీసుకున్న దాదాపు 63 వేల మంది వివరాలు పరిశీలించారు. వీరిలో కొందరు ఎసిడిటీ నివారణకు ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటార్ మందులు వాడగా, ఇంకొందరు హెచ్2 బ్లాకర్ మందులు వాడారు. వీరిలో కొంతమంది కడుపు కేన్సర్‌తో మరణించారు. వీరిలో మూడేళ్ల పాటు ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటార్లు వాడిన దాదాపు 153 మంది ఉండగా.. హెచ్ 2 బ్లాకర్లు తీసుకున్న వారిలో ఎలాంటి లక్షణాలు కన్పించలేదు. అలాగే వారానికో ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటార్ మాత్ర తీసుకునే వారితో పోలిస్తే రోజూ వేసుకునే వారికి కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment