abbott
-
పిల్లల పెరుగుదల: సరైన పోషకాల స్వీకరణ, ప్రాముఖ్యత
పిల్లల్లో పోషకాహార లోపం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రజారోగ్య సమస్య. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మిలియన్ల మంది పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. బాల్యం వేగవంతమైన వృద్ధి దశలో పిల్లల ఎత్తు బరువు వంటి కీలక మైలురాళ్లు. పిల్లల్లో ఎదుగుదల పోషకాహార లోపం, ఆహారపు అలవాట్లు , శారీరక శ్రమ, వివిధ జీవనశైలి కారకాలతో ముడిపడి ఉంటుంది. స్టన్నింగ్ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం) అండర్ వెయిట్ (వయసుకు తగ్గ బరువులేకపోవడం) వేస్టింగ్ (ఎత్తుకు తగ్గ బరువు తక్కువ) లాంటివి కీలక అంశాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 149 మిలియన్ల మంది పిల్లలు వయసు తగ్గ ఎత్తు ఎదగలేదు. భారతదేశంలో వీరి వాటా దాదాపు మూడింట ఒక వంతు. ఐదేళ్లలోపు వయస్సున్న 40.6 మిలియన్ల మంది పిల్లలు స్టన్నింగ్ కేటగిరీలో నమోదైనారు. సరియైన విజ్ఞానం లేకపోవడం, విద్యాపరమైన విజయాలు, ఉత్పాదకత కోల్పోవడం లాంటివి మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలతో పాటు, ఎదుగుదలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. ఇది పిల్లల జీవితంలో వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధిస్తుంది. పోషకాహార లోపాలు రోగనిరోధక శక్తి క్షీణించడం, ప్రవర్తనా సమస్యలు, ఎముకల ఆరోగ్యం క్షీణించడం, కండరాల్లో శక్తి లేకపోవడం లాంటి ప్రమాదాలకు దారితీయవచ్చు. పిల్లలు ఎదగడానికి, నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన మైలురాళ్లను చేరుకోవడానికి సరైన పోషకాహారం అవసరమైన పునాదులేస్తాయి. పిల్లలకు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,కొవ్వుతో పాటు కాల్షియం, విటమిన్ D, విటమిన్ K, అర్జినిన్ వంటి సూక్ష్మపోషకాలతో సహా సరైన మొత్తంలో మాక్రోన్యూట్రియెంట్లు అవసరం. పిల్లల వృద్ధి, ఎగుదలలో పోషకాహార జోక్యం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ గణేష్ కధే, మెడికల్ అండ్ సైంటిఫిక్ అఫైర్స్, అబోట్ న్యూట్రిషన్ బిజినెస్ తెలిపారు. తల్లిదండ్రులు వివిధ స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలతో కూడిన సమతుల్య పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. అబాట్, పోషకాహార లోపం పరిష్కారాల కోసం అబాట్ సెంటర్‌ను ప్రారంభించడంతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కృషి చేయనుంది. నిపుణులు, భాగస్వాముల సహకారంతో, పిల్లలతో సహా, ఇతర జనాభా కోసం పోషకాహార లోపాన్ని గుర్తించడం, చికిత్స , నివారించడంపై దృష్టి ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ పెడ్రో అలార్కోన్ దీనిపై మరిన్ని వివరాలు అందిస్తూ స్టంటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోషకాహారం పాత్రను అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఓవర్ నూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. పోషకాహార సప్లిమెంట్ పానీయాలను సేవించడం ద్వారా పోషకాహార లోపాన్ని పూరించు కోవచ్చు. అవసరమైన విటమిన్లు, ఖనిజాల స్వీకరణలో కూడా దోహద పడతాయి. ఇది పోషకాల స్వీకరణ సామర్థ్యాన్ని పెంచడం లాంటిదే. దీంతో తీసుకున్న ఆహారంలోని శక్తిని పిల్లల శరీరాలు సంపూర్ణంగా స్వీకరిస్తాయని వివరించారు. పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్లు, విటమిన్లు మినరల్స్ కీలకం, అయితే కొన్నిసార్లు కాల్షియం, ఐరన్ జింక్ వంటి 50శాతం పోషకాలు మాత్రమే పిల్లవాడు తినే ఆహారం నుండి లభిస్తాయి. కనుక ఈ విషయంలో పోషకాహార సప్లిమెంట్లు ద్వంద్వ పాత్రను పోషిస్తాయి. ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాల శోషణను మెరుగుపరుస్తాయి. ఇటీవలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 33.8శాతం మంది పిల్లలు ఉన్నారని తేలిందని సికింద్రాబాద్, యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్స్, నియోనాటాలజీ విభాగాధిపతి DNB పీడియాట్రిక్స్ ప్రోగ్రాం హెడ్ డాక్టర్ డీరమేష్ తెలిపారు. గ్రామీణ తెలంగాణలో 33 శాతం మంది సరైన ఎదుగుదలకు తోడ్పడటానికి, పిల్లలకు ఐదు ఆహార సమూహాల నుండి వచ్చే స్థూల మరియు సూక్ష్మ పోషకాల మంచి మిశ్రమం కూరగాయలు, పండ్లు, ప్రోటీన్, పాల ఉత్పత్తులు, ఇంకా తృణధాన్యాలు వల్ల ఆరోగ్యకరమైన సంపూర్ణ ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పిల్లలకు అందేలా తల్లిదండ్రులు ఆహారాన్ని అందించాలి. సమతుల్య ఆహారం, అవసరమైనప్పుడు పోషకాహార సప్లిమెంట్ డ్రింక్స్ లాంటి ఆకర్షణీయమైన కలయికతో పిల్లల అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం తోపాటు, పూర్తి సామర్థ్యాన్ని స్వీకరించే శక్తినిస్తుందని పేర్కొన్నారు. -
'డైజీన్ సిరప్' వాడుతున్నారా? వెంటనే ఆపేయండి! లేదంటే..
ప్రముఖ ఔషధాల తయారీదారు 'అబాట్ ఇండియా' (Abbott India) తన గోవా ఫెసిలిటీలో తయారు చేసిన యాంటాసిడ్ సిరప్ 'డైజీన్ జెల్'కి సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణం ఏంటి? దీని వినియోగం వల్ల వచ్చే ప్రమాదమేంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పింక్ కలర్లో ఉన్న ఈ మెడిసిన్‌ని వినియోగదారులు ఆగస్టు ప్రారంభంలో కొనుగోలు చేసినప్పుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా, ఘాటైన వాసన కలిగి ఉన్నట్లు తెలిసింది. దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అబాట్ యాంటాసిడ్ డైజీన్ జెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటాసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరింది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని, దీని వల్ల రోగి ప్రతికూల ప్రభావాణ్ణి ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది. ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్! నిజానికి డైజీన్ సిరప్ లేదా మాత్రలు అసిడిటీ, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు నొప్పి, గ్యాస్ వంటి వాటిని నివారించడంలో ఉపయోగిస్తారు. అయితే ఈ సమస్యల కోసం ఈ ఔషధం ఉపయోగించే వారు వెంటనే నిలిపివేయాలి. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ ప్రొడక్ట్‌కి రీకాల్ ప్రకటించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా దీనిని ఎవరైనా విక్రయిస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఔషధం వినియోగించిన వ్యక్తికి ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే దాని గురించి తెలియజేయాలని DCGI ఆదేశించింది. -
మురుఘ మఠంలో మృగత్వం...ముగ్గురు కాదు 10 మంది బాలికలపై
బనశంకరి: చిత్రదుర్గలోని ప్రఖ్యాత మురుఘ మఠాధిపతి శివమూర్తి శరణుస్వామి మఠం ఆవరణలోని హాస్టల్ బాలికలపై అత్యాచారం కేసులో పోలీసులు చార్జిషీట్లో విస్మయకరమైన అంశాలను ప్రస్తావించారు. మత్తుమందు కలిపిన యాపిల్ పండ్లను ఇచ్చి వారు మత్తులోకి జారుకున్నాక అఘాయిత్యాలకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఆఖర్లో లైంగిక దాడులకు పాల్పడినట్లు ఇద్దరు బాలికలు ఆరోపించడం తెలిసిందే. తరువాత వారానికి పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల కింద శివమూర్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఉదంతం అంతటా సంచలనం కలిగించింది. చార్జిషీట్లో ఏముంది? ఈ నేపథ్యంలో రెండో పోక్సో కేసు దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ అనిల్ నేతృత్వంలోని పోలీస్‌బృందం సోమవారం చిత్రదుర్గ నగర రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో 694 పేజీల చార్జిషీట్‌ను సమర్పించారు. ఇందులో పలు అంశాలను సవివరంగా పేర్కొన్నారు. హాస్టల్ వార్డెన్ రశ్మి బాలికలను బెదిరించి శివమూర్తి స్వామి వద్దకు పంపేది. యాపిల్ పండ్లలో మత్తు కలిపి బాలికలకు తినిపించేవారు. మత్తులో ఉండగా దారుణాలకు పాల్పడేవారు. కార్యాలయం, బెడ్రూమ్, బాత్రూమ్కు బాలికలను తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిని వ్యతిరేకించే బాలికలను తీవ్రంగా హెచ్చరించి, మఠం పాఠశాల నుంచి ఇళ్లకు పంపేవారు. ఈ రకంగా 10 మందికి పైగా బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. నిత్యం బాలికలపై అఘాయిత్యాలు జరిగేవి. మఠం మహిళా వార్డెన్ రశ్మి, కార్యదర్శి పరమశివయ్యలను కూడా నిందితులుగా పేర్కొన్నారు. ఈ నెల 5న ఆస్పత్రిలో మురుఘ స్వామికి పురుషత్వ సామర్థ్య పరీక్షలు చేయగా, పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఉరి వేయాలి: ఒడనాడి చీఫ్ ఈ ఘటనపై ఒడనాడి సేవా సంస్థ అధ్యక్షుడు పరశురామ్ మాట్లాడుతూ మురుఘ స్వామికి ఉరిశిక్ష విధించాలన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ పోలీసులు బాగా దర్యాప్తు చేశారని, బాధితుల బాధను కోర్టు ముందుంచారని అన్నారు. అలాగే ఏడాది కిందట మఠంలో హత్యకు గురైన బాలిక కేసును బయటకు తేవాలని ఫిర్యాదు చేశామన్నారు. బాలికను హత్య చేసింది ఎవరు అనేదానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. (చదవండి: నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని..) -
కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య.. బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. రామనగర జిల్లా మగాడి తాలుకా కెంపుపురా గ్రామంలోని శ్రీ కంచుగల్ మఠానికి చెందిన 45 ఏళ్ల బసవలింగ స్వామి సోమవారం ఉదయం శవమై కనిపించారు. ఆశ్రమం ఆవరణంలోని పూజా గది కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేచే స్వామి 6 గంటల వరకు లేవకపోవడం, పూజ గది తలుపులు మూసి ఉండటంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా.. సాధువు మరణం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బసవలింగ స్వామి 400 ఏళ్ల చరిత్ర కలిగిన కంచుగల్ మఠానికి 1997లో ప్రధానపీఠాధిపతిగా నియామకయ్యారు. అప్పటి నుంచి (25 సంవత్సరాల పాటు) ఈ మఠానికి ఆయనే అధిపతిగా కొనసాగుతున్నారు. కొన్ని నెలల క్రితం రజతోత్సవాన్ని సైతం జరుపుకున్నారు. స్వామిజీ వద్ద రెండు పేజీల సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనను మఠాధిపతి నుంచి తొలగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్న వారి పేర్లు కూడా ఆ నోట్లో స్వామీజీ రాసినట్లు సమాచారం. అయితే బ్లాక్మెయిల్ కారణంగానే మఠాధిపతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇదిలా ఉండగారెండు నెలల క్రితం బెల్గాంలోని శ్రీ గరు మడివళేశ్వర మఠంలోని బసవ సిద్ధలింగ స్వామి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో తన పేరు రావడంతో స్వామీజీ కలత చెంది ఉంటాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. చదవండి: మరదలిపై పోలీసు అత్యాచారం.. అయిదుసార్లు అబార్షన్.. -
వహ్వా.. దివీస్ ల్యాబ్- అబాట్ ఇండియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్, గ్లోబల్ కంపెనీ అబాట్ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. వారాంతాన ఈ రెండు కంపెనీలూ ఫలితాలు విడుదల చేయడంతో నేటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. దివీస్ ల్యాబ్ 15 శాతం అప్పర్ సర్క్యూట్‌ను సైతం తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ ఎన్ఎస్ఈలో తొలుత దివీస్ ల్యాబ్ షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 3,293ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 14 శాతం జంప్‌చేసి రూ. 3,170 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. అబాట్ ఇండియా ఎన్ఎస్ఈలో తొలుత అబాట్ ఇండియా షేరు 7 శాతం దూసుకెళ్లింది. రూ. 17,350 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4.4 శాతం జంప్‌చేసి రూ. 16,901 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అబాట్ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది. -
దివీస్ ల్యాబ్- అబాట్ ఇండియా- క్యూ1 భళా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్, గ్లోబల్ కంపెనీ అబాట్ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. ఈ రెండు కంపెనీల ఫలితాలు తాజాగా వెల్లడికావడంతో సోమవారం ట్రేడింగ్‌లో అటు దివీస్ ల్యాబ్, ఇటు అబాట్ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇతర వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్ షేరు 2.3 శాతం బలపడి రూ. 2800 వద్ద ముగిసింది. అబాట్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అబాట్ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో అబాట్ ఇండియా షేరు స్వల్పంగా 0.6 శాతం లాభపడి రూ. 16,254 వద్ద ముగిసింది. -
భారత్‌కు యాంటీబాడీ టెస్టింగ్ కిట్లు..
వాషింగ్టన్: తాము రూపొందించిన కోవిడ్-19 యాంటీబాడీ టెస్టింగ్ కిట్లకు సీఈ మార్క్(సర్జిఫికేషన్ మార్కింగ్) లభించిందని హెల్త్‌కేర్ సంస్థ అబాట్ లాబొరేటరీస్ తెలిపింది. ఈ క్రమంలో యూనిట్ల తయారీని పెంచామని.. త్వరలోనే భారత్‌కు కిట్లను ఎగుమతి చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు... ‘‘కోవిడ్-19పై పోరులో అండగా నిలిచేందుకు... వీలైనంత త్వరగా టెస్టింగ్ కిట్లను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నాం. మే చివరినాటికి భారత్‌కు షిప్పింగ్ చేస్తాం. యాంటీబాడీ టెస్టింగ్ ద్వారా ఎవరెవరు మరోసారి కరోనా బారిన పడ్డారనే విషయం సులభంగా తెలిసిపోతుంది’’ అని అబాట్ డయాగ్నటిక్స్ బిజినెస్ ఇండియా జీఎం నరేంద్ర వార్దే ఓ ప్రకటనలో పేర్కొన్నారు.(కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు!) కాగా యాంటీబాడీ లేదా సీరాలజీ బ్లడ్ టెస్టు ద్వారా కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తాన్ని పరీక్షిస్తారు. వారి శరీరంలో యాంటీబాడీస్ ఎంతకాలం వరకు వైరస్‌తో పోరాడాయి.. ఏ మేరకు రోగనిరోధక శక్తిని పటిష్టం చేశాయి అన్న విషయాల్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం వేలి నుంచి రక్తం తీసుకుని.. ఫలితం వెల్లడించడానికి కేవలం 15 నిమిషాలే పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుటకై అబాట్ లాబొరేటరీస్ మాలిక్యులర్ టెక్నాలజీని ఉపయోగించి చిన్నపాటి టోస్టర్ పరిమాణంలో ఉండే పోర్టబుల్ టెస్టింగ్ కిట్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే కరోనా పాజిటివ్.. నెగటివ్ ఫలితాన్ని ఈ కిట్ 13 నిమిషాల్లో వెలువరుస్తుందని సంస్థ పేర్కొంది.( 5 నిమిషాల్లో పాజిటివ్.. 13 నిమిషాల్లో నెగటివ్) -
ఐదు నిమిషాల్లోనే కరోనా టెస్ట్!
కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ వ్యాధిని నిర్ధారించే ‘‘రోగ నిర్ధారణ పరీక్ష కిట్’’ను ఆవిష్కరించినట్లు అబాట్ ల్యాబొరేటరీస్ శుక్రవారం ప్రకటించింది. ID NOW COVID&19 అని పిలిచే ఈ పరీక్షతో అనుమానిత వ్యక్తులకు వ్యాధి సోకిందా లేదా అనే విషయాన్ని 5 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. తాజాగా అమెరికా ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) దీనికి అనుమతులిచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ పరీక్షలను అన్ని ఫిజీషియన్స్ ఆఫీసులు, అత్యవసర సంరక్షణ క్లినిక్‌లు, హాస్పిటల్లో సులభంగా జరపవచ్చని పేర్కొంది. ప్రపంచదేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ అమెరికాలో తీవ్రరూపం దాల్చింది. ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానికులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు. వేలాదిగా వస్తున్న ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయలేక వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అబాట్ ల్యాబొరే టరీస్ కిట్‌కు యూఎస్ఎఫ్డీఏ తన అత్యవసర అధికారాలను వినియోగించి ఈ కిట్‌కు వేగంగా అనుమతులిచ్చింది. సోమవారం నుంచి అందుబా టులోకి! వచ్చే వారం సోమవారం నుంచి పరీక్షలను ప్రారంభించే యోచనలో ఉన్నామని, రోజుకు 50 వేల వరకు పరీక్షలను జరిపే అవకాశం ఉంటుందని అబాట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి ID NOW COVID&19 పరీక్ష అమెరికాకు మాత్రమే పరిమితమవుతుంది. అవసరాన్ని బట్టి భారత్ సహా ఇతర దేశాలకు అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది. ‘‘ఇది అత్యుత్తమైన ముందడుగు. 5 నిమిషాల్లోనే పాజిటివ్ ఫలితాన్ని, 13 నిమిషాల్లో నెగిటివ్ ఫలితాన్ని పొందవచ్చు. ప్రస్తుత పరీక్షలకు 1–2 రోజుల సమయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువే అవుతోంది. మా కిట్‌తో ఈ సమస్య తగ్గుతుంది’’ అని అబాట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ ఫ్రీల్స్ చెప్పారు. -
గోద్రేజ్ బీకేసీ ప్రాజెక్టును కొనుగోలు చేసిన అబాట్
డీల్ విలువ రూ.1,480 కోట్లు అతి పెద్ద రియల్టీ లావాదేవీల్లో ఒకటి న్యూఢిల్లీ: గోద్రేజ్ ప్రొపర్టీస్ సంస్థ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీలో)ని 4.35 లక్షల చదరపుటడుగుల కమర్షియల్ ప్రాజెక్ట్‌ను ఫార్మా దిగ్గజం అబాట్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ.1,480 కోట్లు. భారత్‌కు సంబంధించి అతి పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్‌లో ఇదొకటి. ముంబైలో ఉన్న తన వ్యాపారాన్నంతటినీ ఒకే ప్రాంతానికి తరలించే వ్యూహంలో భాగంగా అబాట్ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేసింది. ఇక్కడ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాలు చేయాలని అబాట్ యోచిస్తోంది. కాగా ఈ నిధులతో కంపెనీ రుణ భారాన్ని తగ్గించుకుంటామని, భవిష్యత్ వృద్ధికి వినియోగించుకుంటామని గోద్రేజ్ ప్రొపర్టీస్ ఎండీ, సీఈఓ పిరోజ్షా గోద్రేజ్ చెప్పారు. ఇంకా ఈ ప్రాజెక్టులో తమకు 3 లక్షల చదరపుటడుగుల స్పేస్ ఉందని, త్వరలో ఈ స్పేస్‌ను కూడా విక్రయిస్తామని వివరించారు. జెట్ ఎయిర్‌వేస్‌తో కలిసి గోద్రేజ్ సంస్థ బీకేసీని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కార్యకలాపాలను లార్సెన్ అండ్ టుబ్రో చూస్తోంది. ఈ ఏడాది మార్చినాటికి గోద్రేజ్ ప్రొపర్టీస్ రుణ భారం రూ.2,764 కోట్లుగా ఉంది. -
వెళ్లిరా...నేస్తమా!
హ్యూస్ అంత్యక్రియలు పూర్తి ఆస్ట్రేలియా ప్రధానితో పాటు వేలాదిమంది హాజరు నిన్నమొన్నటిదాకా మాతో కలసి ఆడావు, పాడావు, తిరిగావు... ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ మాలో ఒకడిలా కలసిపోయావు... ఏం తొందరొచ్చిందని అప్పుడే వెళ్లిపోయావ్... ఏం అనుభవించావని సెలవు తీసుకున్నావ్... ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే ఆటే నిన్ను మింగేసిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నాం... ఆధునిక పరిజ్ఞానం ఉన్నా.. అనుభవజ్ఞులైన వైద్యులున్నా... నిన్ను బతికించుకోలేకపోయామన్న క్షోభ మనసును దహిస్తోంది... భౌతికంగా నువ్వు దూరంకావొచ్చు... కానీ నీ జ్ఞాపకాలు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి... వెళ్లిరా నేస్తమా... నువ్వు ప్రేమించిన ఆటను మళ్లీ ఆడేందుకు! వెళ్లిరా నేస్తమా... ఈ కుటుంబ బాధ్యతను మరో జన్మలోనైనా తీర్చుకునేందుకు! వెళ్లిరా నేస్తమా... నిన్ను మరవలేని నీ స్నేహితులతో కలసి ఆడేందుకు, పాడేందుకు! ...ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ అంత్యక్రియలకు హాజరైన వందలాది క్రికెటర్లు, వేలాది మంది అభిమానుల మూగవేదన ఇది. మాక్స్‌విలే (ఆస్ట్రేలియా): కన్నీళ్లతో కళ్లు చెమ్మగిల్లుతుంటే.. బాధతో హృదయం బరువెక్కుతుంటే... మనసు అంతరాల్లో ఎగసిపడుతున్న ఆందోళనను దిగమింగుకుంటూ... రాకాసి బౌన్సర్‌కు ప్రాణాలు కోల్పోయిన తమ సహచరుడు ఫిలిప్ జోయల్ హ్యూస్కు ఆస్ట్రేలియా తుది వీడ్కోలు పలికింది. బుధవారం వేలాదిమంది సమక్షంలో మాక్స్‌విలేలోని తన వ్యవసాయ క్షేత్రం 408లో క్రికెటర్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. దేశ ప్రధాని టోనీ అబాట్‌తో పాటు ఆసీస్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హ్యూస్కు కడసారి నివాళులు అర్పించారు. భారత తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, మురళీ విజయ్, టీమ్ డెరైక్టర్ రవి శాస్త్రి, మేనేజర్ అర్షద్ అయూబ్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. * క్రికెటర్ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరుకావడంతో మాక్స్‌విలే కిక్కిరిసిపోయింది. * మాక్స్‌విలే హైస్కూల్ స్పోర్ట్స్ హాల్లో పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. క్రికెటర్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు హాల్లో 80 శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు. * క్లార్క్, ఇతర ప్రముఖులు ముందు వరుసలో కూర్చొని ఉండగా, ఫాదర్ మైకేల్ అల్కాక్ నేతృత్వంలో చివరి ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టడంతో హాల్లో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి.శవపేటిక ముందు హ్యూస్ ధరించిన క్రికెట్ ఆస్ట్రేలియా డ్రెస్, బ్యాగీ గ్రీన్ క్యాప్‌లను వికెట్లపై తగిలించి ఉంచారు. * హ్యూస్ కుటుంబ సభ్యులు, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్‌లు పక్కన నిలబడి ఉండగా, క్రికెటర్ గురించి హృదయ వేదన కలిగించే సంతాప సందేశాన్ని క్లార్క్ చదివి వినిపించాడు. తర్వాత హ్యూస్ తోబుట్టువులు, స్నేహితులు తమ సంతాప సందేశాలను చదివారు. * హాల్లో ఉన్నవారందరూ తమ నివాళులు అర్పించిన తర్వాత హ్యూస్ పార్థీవ దేహాన్ని మాక్స్‌విలే వీధుల్లో ఊరేగించారు. ప్రధాని అబాట్, ఆటగాళ్లు, స్నేహితులు, ఇతర అభిమానులు పెద్ద ఎత్తున దీన్ని అనుసరించారు. ఈ సందర్భంగా స్థానికులు చివరిసారిగా క్రికెటర్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. * ఆసీస్ ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ చేసిన తర్వాత క్రికెటర్ శవ పేటికను వ్యవసాయ క్షేత్రానికి తరలించారు.హ్యూస్ తండ్రి గ్రెగ్, సోదరుడు జాసన్, క్లార్క్, ఫించ్, లోనెర్గాన్, మ్యాథ్యూ డే, టామ్ కూపర్లు మాక్స్‌విలే స్పోర్ట్స్ హాల్ నుంచి శవ పేటికను మోసుకెళ్లారు. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న అరటి తోటలో పార్థివ దేహాన్ని ఖననం చేశారు. * మోదీ, సచిన్ నివాళి భారత ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్... హ్యూస్కు నివాళి అర్పించారు. ‘హ్యూస్ మేం నిన్ను మిస్ అవుతున్నాం. * ఆట పట్ల నీ అంకితభావం, నేర్చుకోవాలనే తపన ఎందరికో స్ఫూర్తినిస్తాయి’ అని సచిన్ ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్‌కు 2013లో హ్యూస్ ఆడినప్పుడు అతనితో కలసి ఉన్న ఫొటోను సచిన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా హ్యూస్కు నివాళి అర్పించాడు.పాకిస్తాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే రెండు టి20ల సిరీస్ ట్రోఫీని హ్యూస్కు అంకితం చేశారు. గురు, శుక్రవారాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన క్రికెట్ మైదానాల్లో హ్యూస్ అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. వేలాదిమంది బిగ్ స్క్రీన్‌పై దీనిని చూస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లోపల 63 బ్యాట్లను వరుసగా నిలబెట్టి తనకు నివాళి అర్పించారు. చివరిసారి ఈ మైదానంలోనే ఆడి 63 పరుగులు చేశాక హ్యూస్ తలకు బంతి తగిలింది. హ్యూస్ చివరిసారి ఆడిన రాండ్విక్ ఎండ్‌లో పువ్వులు ఉంచారు. వికెట్ల మీద నుంచి ఒక బెయిల్ తీసి కిందపెట్టారు. ‘సిడ్నీ క్రికెట్ మైదానం నిన్నెప్పటికీ మరవదు’ అని రాశారు. అబాట్‌కు అండగా... హ్యూస్ అంత్యక్రియల సందర్భంగా అందరి దృష్టీ బౌలర్ అబాట్‌పై ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించిన టీవీ చానల్ సిబ్బంది అతనిపైకి కెమెరా వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. తనని చిత్రీకరించి ఇంకా ఎక్కువ ఇబ్బందిపెట్టకూడదని భావించారు. మీడియా కూడా చాలావరకు అతనికి దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ముదురు నీలం రంగు సూట్ ధరించిన 22 ఏళ్ల అబాట్ తన తల్లి జార్జియానా, తండ్రి నాథన్, గర్ల్‌ఫ్రెండ్ బ్రియర్ నీల్‌తో కలసి అంత్యక్రియలకు హాజరయ్యాడు. మృతదేహాన్ని చూడటానికి స్కూల్ ఆవరణలోకి వెళ్లి వచ్చేవరకు నీల్... అబాట్ నడుమును గట్టిగా పట్టుకుని ధైర్యాన్నిచ్చింది. డీన్జోన్స్తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు అబాట్‌ను సముదాయించారు. హ్యూస్ స్నేహితులు, బంధువులు అబాట్‌కు ధైర్యం చెప్పారు. -
ప్రాక్టీస్‌లో అబాట్
సిడ్నీ: హ్యూస్ మరణానికి కారణమైన బంతిని విసిరిన పేసర్ సీన్ అబాట్ ఇప్పుడిప్పుడే ఆ విషాదంనుంచి కోలుకుంటున్నాడు. నేరుగా తన ప్రమేయం లేకపోయినా హ్యూస్ చనిపోవడంతో ఆ రోజునుంచి అబాట్ అపరాధ భావంతో కనిపించాడు. అయితే సహచర ఆస్ట్రేలియా క్రికెటర్లు, సన్నిహితులు అండగా నిలవడంతో కాస్త మామూలు స్థితికి వచ్చాడు. మంగళవారం తొలిసారి అతను మైదానంలోకి దిగాడు. 22 ఏళ్ల అబాట్ న్యూసౌత్‌వేల్స్ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే అతను ఒంటరిగా ఉండకుండా సాధన సమయంలో జట్టు సభ్యులంతా అబాట్‌కు తోడుగా నిలిచారు. మరో వైపు అంత్యక్రియలకు అబాట్ రాక కోసం తామూ ఎదురు చూస్తున్నామని హ్యూస్ సన్నిహితులు వెల్లడించారు. ‘అతడిని గుండెలకు హత్తుకొని అంతా బాగుందని చెప్పాలని మేం భావిస్తున్నాం’ అని వారు అన్నారు. -
అబాట్‌ను ఎవరూ నిందించలేదు: క్లార్క్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అబాట్‌కు ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ పూర్తి మద్దతు ప్రకటించాడు. ఫిలిప్ హ్యూస్ విషాద మరణం ఘటనలో అబాట్‌ను ఎవరూ నిందించడం లేదని, అందులో అతని తప్పు లేనేలేదని క్లార్క్ అన్నాడు. ఆసీస్ క్రికెట్ జట్టు అబాట్‌కు అండగా ఉంటుందని చెప్పాడు. దేశవాళీ మ్యాచ్‌లో అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగిలి యువ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో షాక్‌కు గురైన అబాట్‌కు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. హ్యూస్ సోదరి కూడా అబాట్‌ను కలసి ఓదార్చారు. -
కలసికట్టుగా ముందుకు సాగుదాం
కాన్బెర్రా: భారతదేశ ఆలోచనల్లో ఆస్ట్రేలియా కేంద్ర బిందువుగా ఉంటుందని.. దృష్టి పరిధికి ఆవల కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహితమైన భద్రతా సహకారం ఉండాలని.. ఉగ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రపంచ వ్యూహం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. మోదీ మంగళవారం నాడు ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించటం ఇదే ప్రధమం. ‘‘భారత ప్రధానమంత్రి ఆస్ట్రేలియాకు రావటానికి 28 సంవత్సరాలు పట్టింది. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఆస్ట్రేలియా మా దృష్టి పరిధి చివర్లో ఉండదు. మా ఆలోచనల కేంద్రంలో ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను ప్రస్తావించారు. మోదీ ప్రసంగంలోనిముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఉగ్రవాదం స్వభావం మారుతోంది: ‘‘ఉగ్రవాదం ప్రధాన ప్రమాదంగా మారింది. భారత్‌లో మేం మూడు దశాబ్దాల పాటు దాని ముఖాన్ని విస్పష్టంగా చూశాం. ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద సంస్థల్లో చేరికలకు, హింసాప్రేరణ పెరుగుతున్నాయి. నగదు అక్రమ లావాదేవీలు, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై ఆధారపడి ఉగ్రవాదం మనుగడ సాగిస్తోంది. ఉగ్రవాద మూకల విషయంలో ఎటువంటి తేడా చూపని, దేశాల మధ్య వివక్షకు తావులేని ఒక విధానం, ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే వారిని దూరంపెట్టేందుకు ఒక సంకల్పం, వాటితో పోరాడే దేశాలను బలోపేతం చేసేందుకు ఒక సామాజిక ఉద్యమం రావాలి. ఇందు కోసం మతాన్ని - ఉగ్రవాదాన్ని విడదీసి చూడటం అవసరం. ఈ ప్రాంతంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధితో కూడిన స్వేచ్ఛా ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు మద్దతు అందించాలి. ప్రాంతీయ వాణిజ్య కార్యక్రమాల ప్రారంభమనేది రాజకీయ పోటీ సాధనాలుగా మారటాన్ని నిరోధిస్తూ మనం భద్రత కల్పించాలి. సముద్ర జలాల భద్రత రంగంలోనూ పరస్పర సహకారం పెంచుకోవాలి. అంతర్జాతీయ చట్టం, ప్రపంచ ప్రమాణాలను అందరూ గౌరవించేందుకు మనం కృషి చేయాలి. భారత్, ఆస్ట్రేలియాలు ప్రపంచ వేదికలపై మరింత సన్నిహితంగా సమన్వయం చేసుకోవాలి. భారత అభివృద్ధి ఆస్ట్రేలియాకు వ్యవసాయం, ఆహార శుద్ధి, గనుల తవ్వకాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక, సాంకేతిక, ఇంధనశక్తి రంగాల్లో దీర్ఘకాలిక అవకాశాలను అందిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ అనేదానిని ప్రపంచ వ్యాప్త పేరుగా మలచాలనే బృహత్తర కార్యక్రమం మేం చేపట్టాం.’’ వచ్చే ఏడాది భారత్‌కు యురేనియం.. టోనీ: మోదీకి ముందు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అన్నీ సక్రమంగా కుదిరితే వచ్చే ఏడాది భారత్‌కు యురేనియంను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ‘భారత్ తన ఇంధన శక్తికి, ఆహార భద్రతకు ఆధారపడగల మూలాధారంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని చెప్పారు. ఆస్ట్రేలియాలో తన 5రోజుల పర్యటనను ముగించుకుని మోదీ ఫిజీ చేరుకున్నారు. ‘షర్ట్ఫ్రంటింగ్’ అంటే ఇదేనా? ‘‘ఈ వారంలో మీరు వింటున్న మూడో ప్రభుత్వాధినేత ప్రసంగమిది. ఇది మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలీదు! బహుశా.. ఇది ప్రధానమంత్రి అబోట్ మిమ్మల్ని షర్ట్ ఫ్రంటింగ్ చేసే విధానమేమో!’’ అని మోదీ వ్యాఖ్యానించటంతో ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులందరూ ఘొల్లున నవ్వారు. ఫుట్‌బాల్ క్రీడలో.. ఒక క్రీడాకారుడు ప్రత్యర్థి జట్టు క్రీడాకారుడిని కిందపడదోసేందుకు తన భుజాలతో అతడి ఛాతీని ఢీకొట్టడాన్ని.. ‘షర్ట్ ఫ్రంటింగ్’ అంటారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో వారం రోజుల వ్యవధిలో బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ప్రసంగించారు. ఆ వెంటనే తాను కూడా ప్రసంగిస్తుండటంతో.. మోదీ తన మాటల్లో వరుసగా ముగ్గురు దేశాధినేతల ప్రసంగాలు వినిపిస్తున్నారంటూ.. ‘ప్రధాని టోనీ మిమ్మల్ని షర్ట్ ఫ్రంటింగ్ చేసే పద్ధతి ఇదేనేమో’ అని సరదాగా వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.