ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్: తాము రూపొందించిన కోవిడ్-19 యాంటీబాడీ టెస్టింగ్ కిట్లకు సీఈ మార్క్(సర్జిఫికేషన్ మార్కింగ్) లభించిందని హెల్త్‌కేర్ సంస్థ అబాట్ లాబొరేటరీస్ తెలిపింది. ఈ క్రమంలో యూనిట్ల తయారీని పెంచామని.. త్వరలోనే భారత్‌కు కిట్లను ఎగుమతి చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు... ‘‘కోవిడ్-19పై పోరులో అండగా నిలిచేందుకు... వీలైనంత త్వరగా టెస్టింగ్ కిట్లను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నాం. మే చివరినాటికి భారత్‌కు షిప్పింగ్ చేస్తాం. యాంటీబాడీ టెస్టింగ్ ద్వారా ఎవరెవరు మరోసారి కరోనా బారిన పడ్డారనే విషయం సులభంగా తెలిసిపోతుంది’’ అని అబాట్ డయాగ్నటిక్స్ బిజినెస్ ఇండియా జీఎం నరేంద్ర వార్దే ఓ ప్రకటనలో పేర్కొన్నారు.(కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు!)
కాగా యాంటీబాడీ లేదా సీరాలజీ బ్లడ్ టెస్టు ద్వారా కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తాన్ని పరీక్షిస్తారు. వారి శరీరంలో యాంటీబాడీస్ ఎంతకాలం వరకు వైరస్‌తో పోరాడాయి.. ఏ మేరకు రోగనిరోధక శక్తిని పటిష్టం చేశాయి అన్న విషయాల్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం వేలి నుంచి రక్తం తీసుకుని.. ఫలితం వెల్లడించడానికి కేవలం 15 నిమిషాలే పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుటకై అబాట్ లాబొరేటరీస్ మాలిక్యులర్ టెక్నాలజీని ఉపయోగించి చిన్నపాటి టోస్టర్ పరిమాణంలో ఉండే పోర్టబుల్ టెస్టింగ్ కిట్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే కరోనా పాజిటివ్.. నెగటివ్ ఫలితాన్ని ఈ కిట్ 13 నిమిషాల్లో వెలువరుస్తుందని సంస్థ పేర్కొంది.( 5 నిమిషాల్లో పాజిటివ్.. 13 నిమిషాల్లో నెగటివ్)
Comments
Please login to add a commentAdd a comment