న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలనం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల్లో 2018లో ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకుంది. గతేడాది మార్చి 20న ఇచ్చిన తీర్పు పునఃసమీక్ష కోరుతూ కేంద్రం దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. గత ఉత్తర్వులను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో యథావిధిగా తక్షణ అరెస్ట్ అమల్లోకి వస్తుంది. అలాగే ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందస్తు దర్యాప్తు కూడా అవసరం లేదు. పిటిషన్ విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎస్సీ,ఎస్టీలు ఇప్పటికీ సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. సమానత్వం కోసం వీరు చేస్తోన్న పోరాటం ముగియలేదని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment