సినిమాని తలపించే కథ ఈ సొరంగం స్టోరీ. వాస్తవమో కాదో తెలియదు కానీ. ప్రజలు మాత్రం అందులోకి అడుగుపెట్టాలంటే హడలిపోతారు. చూసేందుకు లోపలకి వెళ్తే బాగుండును అనేంత అందంగా ఉంటుంది. తీరా వెళ్తే మాత్రం అంతే సంగతులు.
బయటి నుంచి చూడటానికి రంగురంగులుగా బాగానే కనిపిస్తుంది గాని, ఈ సొరంగంలోకి అడుగు పెట్టాలంటేనే జనాలు వణికిపోతారు. ఇందులో దయ్యాలు సంచరిస్తుంటాయని, ఇందులోకి వెళ్లే వారిని అవి ముప్పుతిప్పలు పెడతాయని స్థానికులు చెబుతారు. అమెరికాలోని టెనసీ రాష్ట్రం కింగ్స్‌పోర్ట్ సమీపంలో ఉంది. దాదాపు వందేళ్ల కిందట దీనిని సెన్సాబాగ్ అనే ఇంజినీర్ నిర్మించాడు. ఆయన పేరు మీదనే ఇది సెన్సాబాగ్ టన్నెల్‌గా పేరుపొందింది.
ఒక దుండగుడు తనను వెంటాడుతున్న పోలీసుల నుంచి తప్పించుకుని సురక్షితంగా పారిపోవడానికి సెన్సాబాగ్ మనవరాలిని కిడ్నాప్ చేసి, ఈ సొరంగంలోనే దాక్కున్నాడు. పసిపిల్లకు అపకారం జరగకూడదని పోలీసులు అప్పటికి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ దుండగుడు ఇక పసిపిల్లతో తనకు పనిలేదని భావించి ఆమెను చంపేసి, అక్కడే పడేశాడు. ఇది జరిగిన కొంతకాలానికి సెన్సాబాగ్ కూడా మరణించాడు. అప్పటి నుంచి ఈ సొరంగంలో సెన్సాబాగ్, ఆయన మనవరాలి ఆత్మలు సంచరిస్తున్నాయని స్థానికుల కథనం. ఈ సొరంగంలోంచి ప్రయాణిస్తుంటే ఒక్కోసారి కారు ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోతుందని, సెన్సాబాగ్ ఆత్మ కనిపిస్తుందని, పసిపిల్ల ఏడుపు వినిపిస్తుందని కూడా చెబుతారు.
(చదవండి: గుహలు అనుకుంటే పొరబడ్డట్టే.. వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది!)
Comments
Please login to add a commentAdd a comment