అవుకు టన్నెల్ 2 అంటే? | Sakshi Guest Column On Avuku 2nd tunnel | Sakshi
Sakshi News home page

అవుకు టన్నెల్ 2 అంటే?

Published Sun, Dec 3 2023 8:53 AM | Last Updated on Sun, Dec 3 2023 8:53 AM

Sakshi Guest Column On Avuku  2nd tunnel

మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు  అవుకు టన్నెల్ 2 ను ప్రారంభించారు మనం వార్తల్లో చదువుకున్నాం.. అసలు ఇదేంటి? ఇది ఎక్కడుంది? దీని వల్ల ఉపయోగం ఏంటి?కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు శ్రీశైలంలో బ్యాక్ వాటర్ ఉండిపోతుంది.. ఎక్కువగా ఉంటే ఆ వాటర్ ను మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉండదు..

అది శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ అక్కడి నుండి ప్రకాశం బ్యారేజీ తర్వాత సముద్రంలో కలిసిపోతుంది...శ్రీశైలం డ్యాం కెపాసిటీ మించి వరదలు వచ్చినప్పుడు అవి సముద్రం పాలు కాకోకుండా దానిని మనము కరువు జిల్లాలైన రాయలసీమకు మళ్ళి ఇస్తే ఎలా ఉంటుంది???? అనేదానికి రూపకల్పనే హంద్రీనీవా సుజల స్రవంతి మరియు గాలేరు నగరి ప్రాజెక్టులు..శ్రీశైలం బ్యాక్ వాటర్ కుడికెనాలు నుంచి ఈ ప్రాజెక్టులు మొదలవుతాయి.

భానకచర్ల రెగులేటర్ ద్వారా వెలుగోడు, బ్రహ్మ సాగరం, సోమశిల,కండలేరు ఆ విధంగా చెన్నైకి వాటర్ వెళ్ళిపోతుంది.. దానిని తెలుగు గంగ ప్రాజెక్టు అని అంటారుపోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కొంత తెలుగుగంగ కు, కేసీ కెనాల్ కు కొంత గోరుకల్లు రిజర్వాయర్కు వెళుతుంది.. అక్కడ నుంచి అవుకు రిజర్వాయర్కు వచ్చి, అవుకు రిజర్వాయర్ నుంచి మైలవరం రిజర్వాయరు అక్కడినుంచి గండికోట రిజర్వాయర్ కు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ధర్మవరం, నాగసముద్రం అలా అనంతపురం వైపుకు వెళ్తుంది..

గండికోట నుంచి కడప చిత్తూరు కు ఈ వాటర్ వామి కొండ, సర్వారాజసాగర్ అలా 9 రిజర్వాయర్ల ద్వారా ఈ నీరు వెళ్ళిపోతుంది...హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన్ గా అనంతపురం, కర్నూలు జిల్లాలకు వెళ్తే ఈ గాలేరు నగరి ప్రాజెక్టు నంద్యాల కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలకు నీటిని సరఫరా చేస్తుంది... 265,000 ఎకరాలకు (1,070 కిమీ2) సాగునీరు అందించడమే కాకుండా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని గాలేరు నగరి ప్రాజెక్టును నిర్మించారు.

గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువలో ఈ అవుకు సొరంగం కీలకమైనదని, శ్రీశైలంలో వరదలు వచ్చిన 15 రోజుల్లో గాలేరు-నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్‌ను నింపేందుకు ఈ సొరంగం ఉపయోగపడుతుంది. శ్రీశైలం వరదల సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను మళ్లించాలన్నది లక్ష్యం.దీని వల్ల కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 640 గ్రామాల్లోని 20 లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతాయి.

ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో నీటిపారుదల సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. వైఎస్సార్‌ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్‌ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్‌ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు.

అవుకు లో రెండు సొరంగాలు ఎందుకు???
మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. 

అవుకు లో మూడవ సొరంగం కూడా నిర్మాణం అవుతుంది!!! 
ముఖ్యమంత్రి జగన్ గారు‌ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్‌ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్‌ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం.

ఈ విధంగా కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు ఆ నీటిని సముద్రంలో కలవనీయకుండా ఒడిసి పట్టి మనం గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా అవుకు టన్నెల్స్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని మల్లించి అక్కడ నుంచి మనం గండికోట రిజర్వాయర్కు మళ్ళీ ఇస్తాం.. ఇక్కడ నుండి గాలేరు నగరి ప్రాజెక్టు ద్వారా కడప చిత్తూరు నెల్లూరు అనంతపురం జిల్లాలకు తాగునీరు సాగునీరు లభ్యమవుతుంది...

ఒకటే టన్నెల్ సొరంగం ఉంటే కేవలం 5000 క్యూసెక్కుల నీరు మాత్రమే మళ్ళించగలరు అదే మనము రెండు మూడు సొరంగాలు ద్వారా దాదాపు 20వేల క్యూసెక్కుల నీటిని మరలిస్తూ 30 దినాలలో 38 టీఎంసీల నీటిని మనం గండికోట రిజర్వాయర్ వైపు మళ్ళించవచ్చు.. అందుకనే రెండు టన్నెల్ లు కట్టారు.. మూడవ టన్నెలు కూడా రాబోతుంది...
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement