avuku
-
అవుకు టన్నెల్ 2 అంటే?
మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుకు టన్నెల్ 2 ను ప్రారంభించారు మనం వార్తల్లో చదువుకున్నాం.. అసలు ఇదేంటి? ఇది ఎక్కడుంది? దీని వల్ల ఉపయోగం ఏంటి?కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు శ్రీశైలంలో బ్యాక్ వాటర్ ఉండిపోతుంది.. ఎక్కువగా ఉంటే ఆ వాటర్ ను మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉండదు.. అది శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ అక్కడి నుండి ప్రకాశం బ్యారేజీ తర్వాత సముద్రంలో కలిసిపోతుంది...శ్రీశైలం డ్యాం కెపాసిటీ మించి వరదలు వచ్చినప్పుడు అవి సముద్రం పాలు కాకోకుండా దానిని మనము కరువు జిల్లాలైన రాయలసీమకు మళ్ళి ఇస్తే ఎలా ఉంటుంది???? అనేదానికి రూపకల్పనే హంద్రీనీవా సుజల స్రవంతి మరియు గాలేరు నగరి ప్రాజెక్టులు..శ్రీశైలం బ్యాక్ వాటర్ కుడికెనాలు నుంచి ఈ ప్రాజెక్టులు మొదలవుతాయి. భానకచర్ల రెగులేటర్ ద్వారా వెలుగోడు, బ్రహ్మ సాగరం, సోమశిల,కండలేరు ఆ విధంగా చెన్నైకి వాటర్ వెళ్ళిపోతుంది.. దానిని తెలుగు గంగ ప్రాజెక్టు అని అంటారుపోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కొంత తెలుగుగంగ కు, కేసీ కెనాల్ కు కొంత గోరుకల్లు రిజర్వాయర్‌కు వెళుతుంది.. అక్కడ నుంచి అవుకు రిజర్వాయర్‌కు వచ్చి, అవుకు రిజర్వాయర్ నుంచి మైలవరం రిజర్వాయరు అక్కడినుంచి గండికోట రిజర్వాయర్ కు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ధర్మవరం, నాగసముద్రం అలా అనంతపురం వైపుకు వెళ్తుంది.. గండికోట నుంచి కడప చిత్తూరు కు ఈ వాటర్ వామి కొండ, సర్వారాజసాగర్ అలా 9 రిజర్వాయర్ల ద్వారా ఈ నీరు వెళ్ళిపోతుంది...హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన్ గా అనంతపురం, కర్నూలు జిల్లాలకు వెళ్తే ఈ గాలేరు నగరి ప్రాజెక్టు నంద్యాల కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలకు నీటిని సరఫరా చేస్తుంది... 265,000 ఎకరాలకు (1,070 కిమీ2) సాగునీరు అందించడమే కాకుండా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని గాలేరు నగరి ప్రాజెక్టును నిర్మించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువలో ఈ అవుకు సొరంగం కీలకమైనదని, శ్రీశైలంలో వరదలు వచ్చిన 15 రోజుల్లో గాలేరు-నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్‌ను నింపేందుకు ఈ సొరంగం ఉపయోగపడుతుంది. శ్రీశైలం వరదల సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను మళ్లించాలన్నది లక్ష్యం.దీని వల్ల కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 640 గ్రామాల్లోని 20 లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో నీటిపారుదల సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. అవుకు లో రెండు సొరంగాలు ఎందుకు??? మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. అవుకు లో మూడవ సొరంగం కూడా నిర్మాణం అవుతుంది!!! ముఖ్యమంత్రి జగన్ గారు రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఈ విధంగా కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు ఆ నీటిని సముద్రంలో కలవనీయకుండా ఒడిసి పట్టి మనం గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా అవుకు టన్నెల్స్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు నీటిని మల్లించి అక్కడ నుంచి మనం గండికోట రిజర్వాయర్‌కు మళ్ళీ ఇస్తాం.. ఇక్కడ నుండి గాలేరు నగరి ప్రాజెక్టు ద్వారా కడప చిత్తూరు నెల్లూరు అనంతపురం జిల్లాలకు తాగునీరు సాగునీరు లభ్యమవుతుంది... ఒకటే టన్నెల్ సొరంగం ఉంటే కేవలం 5000 క్యూసెక్కుల నీరు మాత్రమే మళ్ళించగలరు అదే మనము రెండు మూడు సొరంగాలు ద్వారా దాదాపు 20వేల క్యూసెక్కుల నీటిని మరలిస్తూ 30 దినాలలో 38 టీఎంసీల నీటిని మనం గండికోట రిజర్వాయర్ వైపు మళ్ళించవచ్చు.. అందుకనే రెండు టన్నెల్ లు కట్టారు.. మూడవ టన్నెలు కూడా రాబోతుంది... డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు -
నంద్యాల జిల్లా: అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ గురువారం జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. 2.60 లక్షలకు సాగునీరు.. 20 లక్షల మందికి తాగునీరు శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు.. అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్‌ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్‌ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్లో పనులు అత్యా«దునిక పద్ధతుల ద్వారా చేపట్టి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీమకు చంద్రబాబు ద్రోహం గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ, నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లోలోక్‌సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 2019 ఎన్నికలకు ముందు నాలుగైదు టీఎంసీలు నిల్వ చేసి తానే గాలేరు–నగరిని పూర్తి చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. సుభిక్షం చేసిన వైఎస్సార్ దివంగత వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ–నీవాను చేపట్టారు. గాలేరు–నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు. పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా హిమాలయాలలో రహదారులు, సైనికుల అవసరాల కోసం సొరంగాల తవ్వకాలకు అనుసరిస్తున్న పాలీ యురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానాన్ని అధ్యయనం చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ నిపుణులను రాష్ట్రానికి రప్పించారు. అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాలేరు–నగరిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేసే దిశగా చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2019లోనే 26.85 టీఎంసీలను నిల్వ చేయడం గమనార్హం. వరుసగా 2020, 2021, 2022లోనూ 26.85 టీఎంసీల చొప్పున గండికోటలో నిల్వ చేశారు. వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కారు నిల్వ చేసింది. సీఎం జగన్ రూ.250 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 2019 నుంచి నాలుగేళ్లుగా పదికి పది టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ వస్తున్నారు. ♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ ఉన్న లింక్ కెనాల్, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కెనాల్‌కు లైనింగ్ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపుతున్నారు. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. -
నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ లో పడవ బోల్తా
-
విహార యాత్రలో విషాదం..
-
ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్థీవదేహానికి నివాళులర్పించిన సీఎం జగన్
-
చల్లా భగీరథరెడ్డి పార్థీవదేహానికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, నంద్యాల: ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్థీవదేహానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈరోజు(గురువారం)నంద్యాల జిల్లా అవుకుకు చేరుకున్న సీఎం జగన్.. చల్లా భగీరథరెడ్డి పార్థీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి ముందుగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చల్లా భగీరథరెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46) గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు.. భగీరథ రెడ్డిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. -
ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ (గురువారం) మధ్యాహ్నం నంద్యాల జిల్లా అవుకు వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అంత్యక్రియలకు హాజరై, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కాగా, నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46)కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. చదవండి: (ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత) -
సొరంగంలో పని చేస్తుండగా.. హిటాచి వాహన ఆపరేటర్ దుర్మరణం
అవుకు (నంద్యాల): అవుకు సొరంగంలో పని చేస్తుండగా పైనుంచి రాళ్లు పడి హిటాచి వాహన ఆపరేటర్ దుర్మరణం చెందాడు. పనిలో చేరిన రెండో రోజు ఈ ఘటన జరగడంతో బాధిత కుటుంబం విషాదంలో మునిగింది. పోలీసులు, కుటుంబసభ్యుల తెలిపిన వివరాల మేరకు.. బేతంచర్ల మండలం గోర్లగుట్ట గ్రామానికి చెందిన ఆల నారాయణ, ఆల కృష్ణవేణి దంపతులకు ఏకైక కుమారుడు ఆలగిరి మద్దిలేటి(28). రెండున్నర ఏళ్ల క్రితం తండ్రి నారాయణ బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ పోషణ భారం ఈ యువకుడిపై పడింది. అవుకు మూడవ టన్నెల్లో పనిచేసేందుకు హిటాచి వాహనం ఆపరేటర్ కావాలని పిలుపు రావడంతో ఈనెల 5వ తేదీ వెళ్లి విధుల్లో చేరాడు. రెండో రోజు మంగళవారం సొరంగంలోకి వెళ్లి పని చేస్తుండగా పై నుంచి ఉన్నట్టుండి పెద్ద బండరాయి పడింది. ఈ ఘటనలో మద్దిలేటి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని టన్నెల్ నిర్మాణ అధికారులు కుటుంబ సభ్యులకు చేరవేయడంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహంపై పడి బోరున విలపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ఏడాదిన్నర క్రితం డోన్ మండలం వెంగనాయునిపల్లె గ్రామానికి చెందిన మౌనికతో వివాహమైన మద్దిలేటికి ఆరు నెలల కుమారుడు మౌనిత్‌కుమార్ ఉన్నాడు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. చదవండి: (భర్త వివాహేతర సంబంధాలు.. వేడినూనె పోసి చంపేందుకు భార్య...) -
కడుపులో బిడ్డకూ కూలి
పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. వారి పాలనాకాలంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన మంచి కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. అవుకును పాలించిన తిమ్మరాజు.. కూలి పనులకు వచ్చే గర్భిణులకు ఒకటిన్నర కూలి ఇవ్వాలని శాసనం చేశారు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. సాక్షి, కొలిమిగుండ్ల: అవుకు రాజ్యంలో నంద్యాల, తాడిపత్రి, గండికోట, గుత్తి వరకు సరిహద్దులు ఉండేవి. ఈ రాజ్యంలో 15వ శతాబ్దకాలంలో కరువు కాటకాలు ఏర్పడి పంటలు పండక, పశువులకు సైతం మేత దొరక్క కొండల నుంచి ఆకులు కోసుకొచ్చేవాళ్లు. అరకొర పంటలతో జనం జీవనం సాగించేవాళ్లు. తన రాజ్యం పరిధిలోని ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనే కోరుకున్నాడు నంద్యాల తిమ్మరాజు. అవుకు సమీపంలో క్రీ.శ 1538లో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో చెరువును తవి్వంచాడు. వందలాది మంది కూలీలతో ఆరోజుల్లోనే ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని మించేలా సీసంతో పోతపోసి పునాదులు బలంగా ఉండేలా నిర్మించారు. ప్రస్తుతం ఈ చెరువు రిజర్వాయర్‌గా అభివృద్ధి చెంది వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతోంది. తిమ్మరాజు ధర్మ శాసనం రైతు సంక్షేమం కోసం నిర్మించిన చెరువు ద్వారా పారే నీటితో పంటలు పండించే రైతులు వరి కోతల కాలంలో పనులకు వచ్చే గర్భిణులకు ఒకటిన్నర కూలి ఇవ్వాలని నియమం పెట్టారు. ఈ నియమం పాటించే వారి పాదాలు ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉంటాయని తిమ్మరాజు ధర్మశాసనం చేశాడు. ఇప్పటికీ అవుకు ప్రజలు రాజు శాసనాన్ని తూ.చ. తప్పక పాటిస్తున్నారు. గర్భిణులు వరి కోతల పనులు చేయడమంటే అంత సులువుగా కాదు..ఆమెతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ సైతం పరోక్షంగా పనిలో పాల్గొన్నట్లేనని రాజు భావించాడు. అప్పట్లో వరి కోతలకు మహిళలే అధికంగా వెళ్లేవాళ్లు. పని ముగిశాక నగదు రూపంలో కూలి కాకుండా ఒక్కొక్కరికి నాలుగు పల్లు వడ్లు ఇచ్చేవాళ్లు. నంద్యాల తిమ్మరాజు విగ్రహం గర్భిణులకు అయితే నాలుగు పల్లతో పాటు అదనంగా ఒకటిన్నర పడి వడ్లు అదనంగా ఇచ్చేవాళ్లు. రైతు తమ కోసం అదనంగా ఇచ్చాడనే ఉద్దేశంతో మళ్లీ మూడు పిడికెళ్ల వడ్లను తిరిగి ఇచ్చేవాళ్లు. తెల్లవారు జామున 3గంటలకు పనిలోకి వెళ్లి.. కోత కోసి.. పంట నూర్పిళ్లు చేసి.. వరి గడ్డిని కట్టలు కట్టి మోసుకొచ్చేవాళ్లు. చాలా మంది గర్భిణులు.. రెండు మూడు రోజులు కాన్పు అయ్యే సమయం వరకు కోత పనులకు వెళ్లేవాళ్లు. కొంత మంది పనులు చేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపట్లోనే కాన్పు అయిన సంఘటనలు ఉన్నాయని గతంలో పనులకు వెళ్లిన వృద్ధులు చెప్పారు. పనులకు గుంపుగా వెళ్లిన మహిళలు.. గర్భిణులకు దగ్గరుండి అరకూలీ అదనంగా ఇప్పించేవారు. పొరుగు గ్రామాల నుంచి సైతం అవుకులో పని చేసేందుకు అప్పట్లో వచ్చేవాళ్లు. కొనసాగుతున్న ఆచారం ఎన్నో ఏళ్ల క్రితం తిమ్మరాజు చేసిన శాసనం ఇప్పటికీ అవుకులో కొనసాగుతోంది. కాలక్రమేణ మార్పులు చోటు చేసుకొని సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చాక వరికోతలకు దాదాపు పదేళ్ల నుంచి యంత్రాలు ఉపయోగించి కోత కొస్తున్నారు. తగ్గు ప్రాంతాల్లో యంత్రాలు దిగని వరిమళ్లలో కూలీల సాయంతోనే కోత కొస్తుంటారు. ప్రస్తుతం కూడా గర్భిణులు పనులకు వెళితే ఆనాటి ఆచారం ప్రకారం అర కూలి అదనంగా ఇస్తున్నారు. అర కూలి ఎక్కువగా ఇచ్చేవాళ్లు తిమ్మరాజు చెప్పిన ప్రకారం గర్భిణులు వరి కోతలకు వెళితే మామూలుగా ఇచ్చే నాలుగు పళ్ల ఒడ్లతో పాటు అదనంగా అర కూలి చొప్పున ఇచ్చేవాళ్లు. కడుపులో పెరిగే బిడ్డ కష్టపడుతుందనే ఉద్దేశంతో కూలి ఎక్కువ ఇచ్చేవాళ్లు. గర్భం దాలి్చనప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు నేను పనులకు వెళ్లాను. –లక్ష్మమ్మ సంప్రదాయం కొనసాగుతోంది రాజు కాలంలో ఆచారం ఇప్పటికీ ఊర్లో కొనసాగుతోంది. గర్భవతిగా ఉన్నా కూడా వరి కోతకు వెళ్లేదాన్ని. పగలు పనికి వెళ్లి రాత్రి ఇంటికొచ్చాక కాన్పు అయిన మహిళలు ఉన్నారు. ఇప్పుడు మిషన్లు రావడంతో కూలీల సంఖ్య తగ్గిపోయింది. – లక్ష్మీనరసమ్మ బరువు పని చేసే వాళ్లం గర్భవతులు ఉన్నా వరి మళ్లలో బరువైన పనులు చేసేవాళ్లం. గడ్డిమోపులను మోసుకెళ్లే వాళ్లం. కాన్పు అయ్యే వరకు కోత పనులకు పోయేదాన్ని. అదనంగా అరకూలి ఇచ్చేవాళ్లు. మెట్టుపల్లెతో పాటు చుట్టు పక్కల ఊర్ల నుంచి మహిళలు పనులకు వచ్చేవాళ్లు. –వెంకట లక్ష్మమ్మ తరతరాల నుంచి పాటిస్తున్నారు మా వంశంలోని పూరీ్వకుడు తిమ్మరాజు పరిపాలన కాలంలో అమలు చేసిన పద్ధతిని తరతరాల నుంచి రైతులు పాటిస్తూ వచ్చారు. గర్భంతో ఉన్న తల్లితో పాటు లోపల ఉన్న బిడ్డకు కూలి ఇవ్వాలన్న ఉద్దేశంతో అర కూలి ఏర్పాటు చేశారు. రైతులు సంతోషంగా ఇస్తూ వచ్చారు. ఈ పద్ధతి బహుశా ఎక్కడా ఉండక పోవచ్చు. –రామకృష్ణరాజు, తిమ్మరాజు వారసుడు -
నమ్మించి.. పాలేరు ప్రాణం తీసి.. రూ.52 లక్షలకు బీమా
సాక్షి, అవుకు : డబ్బు కోసం ఓ టీడీపీ నాయకుడు దుర్మార్గానికి పాల్పడ్డాడు. తమ కుటుంబాన్ని నమ్ముకుని వచ్చిన పాలేరు ప్రాణం తీశాడు. అతని పేరుతో భారీ మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించి.. ఆపై హత్య చేశాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.31 లక్షలు కాజేశాడు. మరో రూ.15 లక్షలు రాబట్టుకునే ప్రయత్నంలో ఉండగా.. విషయం బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవుకు మండలం మెట్టుపల్లె గ్రామానికి చెందిన శీగే ఈశ్వరరెడ్డికి వెంకటేశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి సంతానం. పెద్దకుమారుడైన వెంకటేశ్వరరెడ్డికి ప్యాపిలి మండలం గార్లదిన్నెకు చెందిన రాజమ్మతో రెండున్నర దశాబ్దాల క్రితం వివాహమైంది. అప్పటి వరకు రాజమ్మ పుట్టింట్లో పాలేరుగా ఉన్న వడ్డే సుబ్బరాయుడు ఆమెకు పెళ్లయిన తర్వాత మెట్టుపల్లెకు వచ్చి.. అక్కడ పనులు చేస్తుండేవాడు. తమ రెడ్డమ్మను నమ్ముకుని ఉంటే కూడు, గుడ్డకు లోటు ఉండదని భావించేవాడు. పదిహేనేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వరరెడ్డి చనిపోయాడు. తన యజమానురాలి భర్త మృతి చెందినా సుబ్బరాయుడు మాత్రం అక్కడే ఉంటూ పాలేరు పని చేస్తుండేవాడు. భాస్కర్‌రెడ్డికి దుర్బుద్ధి! వెంకటేశ్వరరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు. పదేళ్ల క్రితం గ్రామ సర్పంచ్‌గానూ పనిచేశాడు. ఇతను పాలేరును అడ్డంపెట్టుకుని అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని పన్నాగం పన్నాడు. ఇందులో భాగంగా నా అన్న వారెవరూ లేని సుబ్బరాయుడికి ఆధార్, రేషన్‌కార్డు తదితరాలను సమకూర్చి..అతని పేరున రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేశాడు. అలాగే దాదాపు రూ.52 లక్షలకు ఓ ప్రైవేట్ కంపెనీలో ఇన్సూరెన్స్ చేశాడు. నాలుగైదు కంతుల ప్రీమియం కూడా కట్టాడు. 2015వ సంవత్సరంలో గ్రామంలో తనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు, అవుకుకు చెందిన మరో ఇద్దరితో కలిసి సుబ్బరాయుడిని హత్య చేసి.. ప్రమాదంగా చిత్రీకరించారు. సుబ్బరాయుడు ప్రమాదంలో మృతి చెందాడంటూ ఇన్సూరెన్స్ కంపెనీని నమ్మించి.. మొదటివిడతలో సుమారు రూ.31 లక్షలు కాజేశాడు. రెండోవిడత కింద మరో రూ.15 లక్షలు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా..ఈ విషయం ఆ నోట ఈ నోట పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. సుమోటోగా కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు భాస్కరరెడ్డితో పాటు మరో నలుగురు వ్యక్తులను నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అవుకుకు చెందిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చూపే అవకాశముంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ
సాక్షి, అవుకు(కర్నూలు) : మండలంలోని రామాపురం ఆంధ్రాబ్యాంక్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి బ్యాంక్‌నే బురిడీ కొట్టించాడు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.40 లక్షల వరకు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్‌కు కొత్త మేనేజర్ రావడంతో ఈ వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. రామాపురంలోని ఆంధ్రాబ్యాంక్‌లో కాంట్రాక్ట్ ప్రతిపదికన గోల్డ్ అౖప్రైజర్‌గా శ్రీనివాసులు అనే వ్యక్తి నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. రుణాల కోసం ఖాతాదారులు తెచ్చే బంగారం సరైనదా లేదా అని బ్యాంక్ అధికారులకు ఈయన నివేదిక అందిస్తారు. అనంతరం రుణాలు మంజూరు అవుతాయి. అయితే నమ్మకంగా ఉండాల్సిన గోల్డ్ అప్రైజర్..అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. చనుగొండ్ల, శింగనపల్లె, అవుకు చెందిన 12 మంది ఖాతాదారుల సంతాకాలు తీసుకొని నకలీ బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంక్ డబ్బును కాజేశాడు. ఇటీవల మేనేజర్ లింగన్న బదిలీ కాగా.. నంద్యాల శివారులోని ఉడుమార్పరం ఎస్బీఐ శాఖ నుంచి రామాపురానికి నవీన్ కుమార్ రెడ్డి బ్యాంక్ మేనేజర్ బదిలీపై వచ్చారు. ఖాతాదారులకు సంబంధించి అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే రుణాలకు సంబంధించిన వివరాలు నూతన మేనేజర్‌కు అప్పజేప్పే క్రమంలో నకిలీ బంగారం వ్యవహారం బట్టబయలైంది. సంబంధిత రైతులను విచారించగా తాము ఎలాంటి రుణాలు పొందలేదని చెప్పడంతో సదరు గోల్డ్ అప్రైజర్ శ్రీనువాసులు అక్రమాలు బయటపడ్డాయి. -
అవుకు వాసి ‘అనంత’లో ఆత్మహత్య
తాడిపత్రి రూరల్ : కర్నూలు జిల్లా అవుకుకు చెందిన అప్పుస్వామి(42) అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గదరగుట్టపల్లి సమీపంలో ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొన్నారు. వెదురు బొంగుల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అప్పుస్వామికి ఏడాది కింద పిచ్చికుక్క కరవడంతో అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాడిపత్రి మండలం భోగసముద్రానికి వెళ్లొస్తానంటూ గురువారం ఇంటి నుంచి బయలుదేరిన అతను మార్గమధ్యంలో గదరగుట్టపల్లి వద్ద విషపు గుళికలు మింగి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయమే గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడు అవుకుకు చెందిన అప్పుస్వామిగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు. మృతుని భార్య రామాంజనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.