
సాక్షి, నంద్యాల: ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్థీవదేహానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈరోజు(గురువారం)నంద్యాల జిల్లా అవుకుకు చేరుకున్న సీఎం జగన్.. చల్లా భగీరథరెడ్డి పార్థీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి ముందుగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చల్లా భగీరథరెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు.
నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46) గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు.. భగీరథ రెడ్డిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment