అడుసుమిల్లి కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan Tributes To YSRCP Adusumilli Jayaprakash | Sakshi
Sakshi News home page

అడుసుమిల్లి కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published Tue, Oct 8 2024 6:33 PM | Last Updated on Tue, Oct 8 2024 7:12 PM

YS Jagan Tributes To YSRCP Adusumilli Jayaprakash

సాక్షి, విజయవాడ: ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్‌ చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులర్పించారు.

విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్‌ నివాసానికి వెళ్ళిన వైఎస్‌ జగన్‌.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయప్రకాష్‌ కుమారుడు తిరుమలేష్‌తో పాటు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జయప్రకాష్‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్రమంలో మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్‌ తనదైన ముద్ర వేసుకున్నారని వైఎస్‌ జగన్‌ గుర్తుచేసుకున్నారు. 

మరోవైపు.. అడుసుమిల్లి ఇంటికి వైఎస్‌ జగన్‌ వస్తున్నారన్న సమాచారంతో భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ అభిమానులు జయప్రకాశ్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నేత జగనన్నకు ఘన స్వాగతం పలికారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement