సాక్షి, న్యూఢిల్లీ: పూర్తిగా కరెంటు సదుపాయం ఉన్న డబుల్ స్టాక్ కంటైనర్లను తీసుకెళ్లేందుకు వీలున్న ఏకైక విద్యుద్దీకరణ టన్నెల్‌ను భారత రైల్యే నిర్మిస్తోంది. ఇలాంటి భారీ టన్నెల్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ లేదు. దీన్ని హరియాణాలోని సోన్హా అరావళి పర్వత శ్రేణుల్లో నిర్మిస్తోంది. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌గా పిలిచే ఈ ప్రత్యేక సొరంగం నిర్మాణ పనులను డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చేపట్టింది. ఇప్పటి వరకు కిలోమీటర్ వరకు కావింగ్ పనులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: రైల్వే ప్రయాణికుల టికెట్ తనిఖీ కోసం కొత్త యాప్)
ఓ ఇంగ్లీష్ ఛానెల్ ప్రకారం.. డబుల్ స్టాక్ కంటైనర్లు వెళ్లడానికి అనువుగా ఉండే ప్రపంచ మొట్టమొదటి సొరంగం ఇదే. ఈ సోరంగం ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా ఏమాత్రం చెక్కు చెదరలేదని నిపుణులు తెలిపారు. ఎందుకంటే ఇది 250 కోట్ల నుంచి 50 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ప్రోటిరోజోయిక్ రాళ్లతో నిర్మించారు. ఈ రాళ్లు ఎంత బలమైన వస్తువునైనా మోసే సామర్థ్యం ఉన్నవని నిపుణులు పేర్కొన్నారు. సాధారణంగా సింగిల్ కంటైనర్లను మాత్రమే సొరంగాల్లో తీసుకెళ్తారు. కానీ ఈ భారీ సోరంగ మార్గం గుండా డబుల్ కంటైనర్లను, ఒక కంటైనర్‌పై మరో కంటైనర్ ఉంచి తీసుకెళ్లవచ్చు. కంటైనర్ ఎంత బరువు ఉన్నప్పటికి ఈ సొరంగం చెక్కు చెదరదని నిపుణులు అభిప్రాయపడినట్లు రైల్యే అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment