పుణె సొరంగ ప్రమాదంలో 8 మంది మృతి | 8 Workers Killed As Tunnel Lift Cables Snap Near Pune | Sakshi
Sakshi News home page

పుణె సొరంగ ప్రమాదంలో 8 మంది మృతి

Published Tue, Nov 21 2017 2:58 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

8 Workers Killed As Tunnel Lift Cables Snap Near Pune - Sakshi

పుణె : నీరా–భీమ నదీజలాల అనుసంధానానికి సంబంధించిన ఓ సొరంగంలో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పుణెకు 120 కి.మీ.ల దూరంలోని అకోలే గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది. 100 అడుగులకుపైగా లోతులో సొరంగంలో విధి నిర్వహణలో ఉన్న కార్మికులు లిఫ్ట్‌లో పైకి వస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్‌ తీగలు తెగిపోయాయి.

దీంతో లిఫ్ట్‌ ఒక్కసారిగా సొరంగంలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు మహారాష్ట్ర వాసులు కాదని, వీరు ఏ రాష్ట్రం వారనేది ఇంకా తెలియదని పోలీసులు చెప్పారు. కృష్ణ భీమ పథకంలో భాగంగా 24.8 కి.మీ. పొడవైన నీరా–భీమ నదీజలాలను అనుసంధానిస్తున్నారు. ప్రాజెక్టులోభాగంగా మొత్తంగా ఐదు సొరంగాలు తవ్వుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement