
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో నిజాం కాలంనాటి సొరంగం బయటపడింది. పాతబస్తీలోని డబీర్‌పురాలో ఓ ఇంటి నిర్మాణం చేపడుతుండగా భారీ సొరంగం కనిపించింది. సొరంగంలో నిజాం కాలంనాటి ఫిరంగి తుటాలు లభ్యమయ్యాయి. దీంతో సొరంగాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సమాచారం అందడంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పురావస్తుశాఖ అధికారులు కూడా సొరంగాన్ని సందర్శించి.. దాని పూర్వాపరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.