dabirpura police
-
పాతబస్తీలో బయటపడ్డ ‘నిజాం’ సొరంగం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో నిజాం కాలంనాటి సొరంగం బయటపడింది. పాతబస్తీలోని డబీర్‌పురాలో ఓ ఇంటి నిర్మాణం చేపడుతుండగా భారీ సొరంగం కనిపించింది. సొరంగంలో నిజాం కాలంనాటి ఫిరంగి తుటాలు లభ్యమయ్యాయి. దీంతో సొరంగాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సమాచారం అందడంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పురావస్తుశాఖ అధికారులు కూడా సొరంగాన్ని సందర్శించి.. దాని పూర్వాపరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రిమాండ్
డబీర్‌పురా: మైనర్ బాలికపై ఆత్యాచారానికి పాల్పడిన ఓ నిందితున్ని శనివారం డబీర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మీర్‌చౌక్ ఏసీపీ ఎస్.గంగాధర్ వివరాలను వెల్లడించారు. వివరాలు.. నూర్‌ఖాన్‌బజార్ ప్రాంతానికి చెందిన సాబేరా బేగం ఇంట్లో షాహిన్‌నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (12) గత ఐదు నెలలుగా పని చేస్తుంది. కాగా సాబేరా బేగం ఇంటి సమీపంలో అల్లుడు అహ్మదుల్లా ఖాన్ ఆలియాస్ ఫర్హత్ (50) నివాసముంటున్నాడు. బాలిక తరుచూ కూరగాయలను ఇచ్చేందుకు అహ్మదుల్లా ఇంటికి వెళ్లేది. కాగా బాలికపై కన్నేసిన అహ్మదుల్లా గత నాలుగు రోజుల క్రితం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. షాహిన్‌నగర్ నుంచి కూతురిని చూసేందుకు తల్లి అఫ్సియా బేగంకు చేరుకుంది. దీంతో బాలిక జరిగిన సంఘటనను తల్లి అఫ్సియా బేగంకు వివరించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు శనివారం అహ్మదుల్లాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.