లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య దాడులు, ప్రతిదాడుల ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హెజ్‌బొల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో.. హెజ్‌బొల్లా టన్నెల్‌కు సంబంధించి ఇనుప తలుపులు, ఫంక్షన్ రూమ్‌లు, ఏకే 47 రైఫిళ్లు, బెడ్రూం, బాత్రూం, స్టోర్ రూం, జనరేటర్, వాటర్ ట్యాంక్, ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి.
దక్షిణ లెబనాన్‌లో వంద మీటర్ల మేర ఉన్న ఈ సొరంగంలో హెజ్‌బొల్లా సామగ్రి దృష్యాలను ఇజ్రాయెల్ ఆర్మీ చూపించింది. అయితే.. ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే విషయంపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.
INSIDE LOOK into a Hezbollah terrorist tunnel in southern Lebanon: pic.twitter.com/h3ZastZHxC
— Israel Defense Forces (@IDF) October 15, 2024
‘‘దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హెజ్‌బొల్లా గ్రూప్ ఏం చేస్తోందో చూడడానికి మేము సరిహద్దును దాటి అక్కడి వెళ్తున్నాం. ఉత్తర ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 హమాస్ తరహా దాడికి హెజ్‌బొల్లా టన్నెల్‌ను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది’’ అని వీడియో ఓ ఇజ్రాయెల్ సైనికుడు మాట్లాడటం వినవచ్చు.
ఇక.. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తనంతరం గాజాపై ఇజ్రయెల్ సైన్యం భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా తమ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇక.. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్.. సరిహద్దుల్లో వాటి స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment