
ప్రియురాలిని కలుసుకునేందుకు తవ్విన సొరంగం
మెక్సికో: ప్రేమకు అవధులు లేవంటారు.. కానీ ప్రేమికుల చేష్టలకు కూడా అవధులు లేకుండా పోతున్నాయి. ఇక్కడ చెప్పుకునే ప్రేమ పక్షులకు ఇది వరకే పెళ్లైంది, వేరేవారితో! అయినా సరే దారులు వేరైనా కొత్త దారి ఏర్పాటు చేసుకుని మరీ ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు. అర్థం కాలేదా? అయితే ఓసారి ఇది చదివేయండి..
మెక్సికోకు చెందిన అల్బర్టో వివాహితుడు. కానీ కట్టుకున్న భార్యను పక్కన పెట్టి అదే వీధిలో ఉన్న పమేలా అనే మహిళ మీద మనసు పారేసుకున్నాడు. అక్కడ ఆమె కూడా అంతే! తనకు భర్త ఉన్నాడన్న విషయం మర్చిపోయి ఇతడితో ఎఫైర్ మొదలు పెట్టింది. ఇక వీళ్లు ఏకాంతంగా మాట్లాడుకునేందుకు ఓ ప్లాన్ వేశారు. అందులో భాగంగా అల్బర్ట్ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఏకంగా ప్రియురాలి ఇంటికి సొరంగం తవ్వాడు. పమేలా కూడా భర్త వెళ్లగానే ప్రియుడికి సిగ్నల్ ఇచ్చేది. అలా అల్బర్ట్ నిత్యం తన ఇంట్లో నుంచి సొరంగ మార్గం గుండా వెళ్లి ప్రియురాలి ఇంట్లో తేలేవాడు. (చదవండి: ఆన్‌లైన్ పెళ్లి; ఇన్ని రకాల వంటలా!)
ఈ క్రమంలో ఒకరోజు పమేలా భర్త త్వరగా ఆఫీసు ముగించుకుని వచ్చేయగా తన భార్య మరొకరితో ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. అతడిని చూసిన అల్బర్టో వెంటనే వచ్చిన దారిలోనే పారిపోయే ప్రయత్నం చేయడంతో సొరంగ మార్గం బయటపడింది. వీళ్ల వ్యవహారంతో ఆగ్రహించిన జార్జ్ అతడి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఈ లడాయి కాస్తా కొట్లాటగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోక తప్పలేదు. కాగా ఈ రహస్య ప్రేమికుల సొరంగం ఎంత పొడవుందో తెలియదు కానీ దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. (చదవండి: అనకొండకు చిక్కి.. ప్రాణాల కోసం విలవిల)
Comments
Please login to add a commentAdd a comment