సభ్య సమాజం తలదించుకునేలా... | Man rapes 70-year-old woman: police | Sakshi
Sakshi News home page

సభ్య సమాజం తలదించుకునేలా...

Published Wed, Feb 11 2015 10:05 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

సభ్య సమాజం తలదించుకునేలా... - Sakshi

సభ్య సమాజం తలదించుకునేలా...

ఉత్తరకాశీ: కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడొకడు 70 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి మనవరాలిని బలాత్కరించేందుకు నిందితుడు శైలేంద్ర విఫలయత్నం చేశాడు. ఆమె తప్పించుకోవడంతో వృద్ధమహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా ఖదారా గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

బాధితురాలు మనవరాలు(14)తో కలిసి నివసిస్తోంది. చిన్నారిపై కన్నేసిన శైలేంద్ర ఆమెను చెరబట్టేందుకు ప్రయత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకుని బాలిక మరో గదిలోకి పారిపోయి లోపల గడియ పెట్టుకుంది. విచక్షణ కోల్పోయిన శైలేంద్ర బాలిక బామ్మపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement