డెహ్రడూన్: దీపావళి పండుగను జరుపుకునేందుకు డెహ్రడూన్ వచ్చిన యువతీయువకులు కామాంధుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన మౌమిత దాస్(27), ఆమె స్నేహితుడు అవిజిత్ పాల్(24) గతనెల 21న డెహ్రడూన్ వచ్చారు. రెండు రోజుల తర్వాత వీరు కనిపించకుండాపోయారు. తర్వాత పాల్ మృదేహం ఉత్తరకాశీలోని పరోలా ప్రాంతంలో బయటపడింది. దీంతో పాల్ వెంట వెళ్లిన తన కూతురు కోసం మౌమిత తండ్రి అక్టోబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయడంతో చిక్కుముడి వీడింది.
అక్టోబర్ 23న టైగర్స్ పాల్స్ కు వెళ్లి ట్యాక్సీలో తిరిగొస్తున్న మౌమితను డ్రైవర్ రాజు రేప్ చేసి హత్య చేశాడు. అంతకుముందే రాజు, అతడి స్నేహితులు బబ్లూ, గుడ్డు, కుందన్... అవిజిత్ ను గొంతునులిమి చంపేశారు. అవిజిత్ మృతదేహాన్ని రెండు కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి కొండ మీద నుంచి కిందకు పడేశారు. ఇంటరాగేషన్ లో నిందితులు నేరం అంగీకరించారని పోలీసులు తెలిపారు. మౌమిత మృతదేహాన్ని లఖమండల్ వద్ద యుమనా నదిలో పడేసినట్టు నిందితులు తెలపడంతో గాలింపు చేపట్టారు.
కామంధుల చేతుల్లో బలైన జంట
Published Wed, Nov 12 2014 12:04 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement