
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం
► మృతులంతా మధ్యప్రదేశ్ వాసులు
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 29మందితో ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళుతున్న బస్సు నదిలో పడింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురుని రెస్క్యూ సిబ్బంది కాపాడింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సంఘటన స్థలానికి పెద్ద మొత్తంలో పోలీసులు రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. కొంతమంది స్థానికులు కూడా అక్కడికి వచ్చి సహాయం చర్యల్లో రెస్య్కూ బృందాలకు సహాయపడుతున్నారు. కాగా, ఈ ఘటనపట్ల మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయినవారికి ఒక్కొక్కరికి రూ.2లక్షలు పరిహారం ప్రకటించారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు. గాయ పడ్డవారికి రూ.50 వేలు ప్రకటించారు.